Samantha : సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే సమంత ముందు వరుసలో ఉంటుంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ స్టేటస్ ని దక్కించుకుంది ఆమె. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సౌత్ లో వరుసగా స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని నేడు ఈ స్థానం కి చేరుకుంది.

కేవలం హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటుగా, అప్పుడప్పుడు విలన్ రోల్స్ కూడా చేస్తూ విలక్షణ నటిగా మంచి పేరుని సంపాదించింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో ఈమె పోషించిన విలన్ పాత్ర ఆమెకి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫేమ్ ని తెచ్చిపెట్టింది. రీసెంట్ గానే బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో నటించిన సమంత , ఈ సిరీస్ తర్వాత ఏకంగా ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఫిలిప్ జాన్ దర్శకత్వం లో సమంత ఒక హాలీవుడ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘ది అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకున్నారు. ఇందులో సమంత తమిళ నాడు కి చెందిన ఒక సీక్రెట్ ఏజెంట్ పాత్ర ని పోషించాలని అనుకుంది. కథ ఆమెకి ఎంతో నచ్చింది, ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అనే ఆతృతలో ఉంది.

కానీ ఆమెకి మధ్యలో మయోసిటిస్ వ్యాధి సోకడం , చావుతో పోరాడి బయటకి రావడం, డాక్టర్లు సంవత్సరం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడం తో ఈ సినిమా మేకర్స్ ఇప్పుడు సమంత ని ఈ చిత్రం నుండి తప్పించి శృతి హాసన్ ని తీసుకుంటున్నట్టు తెలిసింది. ఎంతో ఇష్టమైన ప్రాజెక్ట్ చెయ్యి జారిపోవడంతో సమంత తన సన్నిహితుల వద్ద కన్నీళ్లు పెట్టుకుంది అట.