Samantha : క్లాసిక్ చిత్రాల దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘ఏ మాయ చేసావే‘ సినిమాతో ఇండస్ట్రీ పరిచయం అయింది సమంత. తొలి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిలో పడి స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. తన అద్భుతమైన నటనతో పాటు చూపులు తిప్పుకోలేని అందంతో కుర్రకారు మతిని పోగొట్టింది.
ఆ సినిమా తర్వాత దాదాపు ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్‌లోని అగ్ర హీరోల అందరితో నటించింది. వరుసపెట్టి సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుని లాంగ్ రన్ కెరీర్ కొనసాగించింది. ఎప్పుడైతే నాగ చైతన్య తో డివోర్స్ తీసుకుందో అప్పటి నుంచి తాను లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అనిపిస్తుంది.
ఆ మధ్యలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ రెండవ సీజన్ లో విలన్ పాత్ర చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రీసెంట్ గానే విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఖుషి‘ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో ఆమెకి నటనకు మంచి మార్కులు పడ్డాయి, కమర్షియల్ గా కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇది ఇలా ఉంటే సమంత చాలా కాలంగా ‘మయోసిటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సమంత చివరి ఆపరేషన్ నిమిత్తం కోసం ఇటీవల న్యూయార్క్ కూడా వెళ్లింది. విజయవంతంగా చికిత్స చేయించుకుని తిరిగి వచ్చింది.
దీంతో ఆమెకు ఓ ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారట. షూటింగ్ లో వాడే లైట్స్ కి అసలు ఎదురు పడొద్దని హెచ్చరించారట. ఈ కారణంతోనే ఆమె ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట ఏమిటంటే.. సమంత అతి త్వరలో శాశ్వతంగా సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆమె ఒప్పుకున్న సినిమాలకు, తీసుకున్న అడ్వాన్స్ నిర్మాతలకు తిరిగి ఇచ్చేస్తోందట.
అంతే కాకుండా రీసెంట్ గానే ఒక క్రేజీ స్టార్ డైరెక్టర్ సమంత ని కలిసి ఒక స్టోరీ ని వినిపించగా, చేయలేనని చెప్పేసిందట. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈమధ్య కాలం లో చాలా కథలనే రిజెక్ట్ చేసిందట. ఇదంతా చూస్తుంటే తాను నిజంగానే సినిమాలకు దూరం కాబోతున్నట్లు అర్థం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.