సమంత విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సరికొత్త రొమాంటిక్ మూవీ ఖుషి సెప్టెంబర్ 1 వ తేదీ గ్రాండ్గా వరల్డ్ వైడ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఎంతో వైవిధ్యంగా ,జోరుగా జరుగుతున్నాయి. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజున నిర్వహించిన ఖుషి మ్యూజికల్ నైట్ పలు రకాల వివాదాలకు దారితీసింది.సమంత ,విజయ్ దేవరకొండ హాట్ డాన్స్ ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ చేసిన కండల ఫీట్స్ పలు రకాల విమర్శలకు దారి తీసాయి. దీనితో పాటుగా ఒక సాంగ్ పర్ఫామెన్స్ సందర్భంగా సమంత ఎమోషనల్ అవ్వడం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రియతమా ప్రియతమా సాంగ్ ని పాడినప్పుడు సమంత ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.‘ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా…’లిరిక్స్ వచ్చినప్పుడు సమంత కళ్ళలో ఎన్నో చెప్పలేని ఎమోషన్స్ కదలాడడం కెమెరా కంటికి చిక్కింది. ఖుషి సినిమా డైరెక్టర్ అయిన శివ నిర్వాణ సమంతా, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం మజిలీ ని కూడా డైరెక్ట్ చేశారు.
సమంత నాగచైతన్య పెళ్లయిన కొత్తల్లో విడుదలైన ఈ చిత్రం వాళ్ళిద్దరికీ ఎంతో స్పెషల్ అని పలు సందర్భాలలో ఇద్దరు చెప్పడం జరిగింది. అలాంటి మజిలీ చిత్రం లోని పాట సమంతను బాగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యేలా చేసింది. సమంత ఎమోషన్స్ నాగచైతన్య గుర్తు రావడం వలన లేక ఆమె జీవితంలో జరిగినటువంటి చేదు అనుభవాలు గుర్తు రావడం వలన అన్న విషయం ఎవరికీ తెలియదు.
మొత్తానికి స్టేజ్ పై సింగర్ సాంగ్ పాడుతున్న సమయంలో సమంత ఆల్మోస్ట్ ఏడ్చినంత పని చేసింది. అసలు విషయం ఎవరికీ తెలియక పోయినప్పటికీ చాలామంది తమకు తోచిన కామెంట్స్ పెడుతూ ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.