Naga chaitanya – Samantha : గత మూడేళ్ళ నుండి సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో జుండే పేర్లు సమంత మరియు నాగ చైతన్య. వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవడమే ఒక సెన్సేషనల్ టాపిక్, ఆ తర్వాత ఇద్దరు కొన్నాళ్ళకు విబేధాలు వచ్చి విడిపోయిన తర్వాత వీళ్ళ మీద మీడియా లో వచ్చినన్ని గాసిప్స్ బహుశా ఇండస్ట్రీ లో ఏ హీరో మీద కానీ హీరోయిన్ మీద కానీ వచ్చి ఉండదు. వీళ్లిద్దరు విడిపోయిన సంగతి వాళ్ళు కూడా మర్చిపోయి, ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీ గా ఉంటున్నారు.
కానీ అభిమానులు మాత్రం వాళ్ళిద్దరినీ వదలడం లేదు. ప్రతీ రోజు ఎదో ఒక వార్త ని వీళ్లిద్దరి మీద పుట్టిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళు విడాకులు రద్దు చేసుకొని మళ్ళీ ఒక్కటి అవ్వబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై వివిధ కోణాల్లో రకరకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నాయి కానీ ఏది నిజం ఏది అబద్దం అనేది కనిపెట్టలేకపోతున్నారు అభిమానులు.
రీసెంట్ గా వీళ్లిద్దరు కలిసి విమానాశ్రయం లో కనిపించారు అంటూ ఒక ఫోటో విడుదల అయ్యింది. ఇప్పటి వరకు ఈ ఫోటో సోషల్ మీడియా లో రాలేదు, అంటే ఇది పాత ఫోటో అనడానికి లేదు, కొత్త ఫోటోనే. ఆ విధంగా సోషల్ మీడియా లో వచ్చిన ఈ రూమర్ నిజమేనేమో అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. వీళ్లిద్దరు కలిస్తే చూడాలి అనేది చాలా మంది కోరిక. కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఎంతో ఇష్టపడే జంట ఇది.
ఒకరి కోసం ఒకరు పుట్టారు అన్నట్టుగా వీళ్ళ జంట అందరికీ అనిపిస్తుంది. సోషల్ మీడియా లో వచ్చే రూమర్స్ పై నాగ చైతన్య పెద్దగా పట్టించుకోడు కానీ, సమంత మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ప్రతి రూమర్ పై ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా స్పందించే సమంత, ఈ రూమర్ మీద మాత్రం మౌనం పాటిస్తుంది. ఈ మౌనం కి అర్థం మళ్ళీ వీళ్లిద్దరు కలిసిపోయినట్టే కదా అని అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి.