ఎన్నో ఆరోగ్య సమస్యలతో పోరాడి నేడు సినిమా షూటింగ్స్ లో మళ్ళీ బిజీ గా మారిన సమంత లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఖుషి’ అనే చిత్రం లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తారీఖున గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకుల నుండి అశేష ఆదరణ దక్కించుకుంది.

ట్రైలర్ చూసినప్పుడు ప్రతీ ఒక్కరికి ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని లవ్ స్టోరీ ని చూడబోతున్నాము అనే ఫీలింగ్ కలిగింది. ఈ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ సినిమాలన్నీ అలాగే ఉంటాయి. ఆయన దర్శకత్వం వహించిన ఏ సినిమాని చూసిన అందులో కొత్తదనం కనిపిస్తుంది. అదే ఈ ఖుషి ప్రమోషనల్ కంటెంట్ లో కూడా కనిపించింది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ‘మ్యూజిక్ కన్సర్ట్’ నిన్న హైదరాబాద్ లో అభిమానుల సమక్షం లో కనుల పండుగ లాగ జరిగింది.

ఈ ఈవెంట్ లో సమంత మాట్లాడిన ఎమోషనల్ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘ ఈ సినిమాలో పని చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది, నా పరిస్థితులను అర్థం చేసుకొని ప్రతీ ఒక్కరు నాకు ఎంతో సపోర్టుగా నిలిచారు. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ గారు, మీరు నాకు ఇచ్చిన సప్పోర్టుని ఎప్పటికీ మరచిపోలేను, చిరకాలం గుర్తించుకుంటాను. మీరు నా ఫేవరెట్ ప్రొడ్యూసర్స్ మరియు ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్స్ కూడా. అలాగే విజయ్ దేవరకొండ , శివ నిర్వాణ తో కలిసి నటించడం నాకు చాలా సరదాగా అనిపించింది. విజయవాడ లో ఇడ్లీ స్టాల్స్ పెట్టుకోమని నన్ను ఆటపట్టించేవాళ్ళు’ అంటూ చెప్పుకొచ్చింది సమంత.

అలా ప్రసంగం ముగిస్తున్న సమయం లో సమంత ఫ్యాన్స్ కేరింతలతో సభా స్థలం దద్దరిల్లిపోతుంది. అప్పుడు సమంత అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ‘మీ కోసం నేను సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగి వస్తా, బ్లాక్ బస్టర్ కొట్టి తీరుతా’ అని సమాధానం ఇస్తుంది. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.