Samantha : ‘నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను’ అంటూ సమంత ఎమోషనల్ పోస్ట్

- Advertisement -

Samantha : సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న నలుగురు హీరోయిన్స్ పేర్లు చెప్పమంటే మనకి ముందుగా గుర్తుకొచ్చే పేరు సమంత. కేవలం ఈమె కోసమే థియేటర్స్ కి కదిలే ఆడియన్స్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అందుకే ఈమెని పెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తియ్యడానికి దర్శక నిర్మాతలు ఎగబడుతూ ఉంటారు. అయితే స్టార్ స్టేటస్ పరంగా ఈ రేంజ్ లో ఉన్న సమంత మనస్తత్వం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. Samantha ఇంస్టాగ్రామ్ అకౌంట్ చూస్తే ఎంత ఎమోషనల్ పర్సన్ అనేది తెలుస్తాది.

Samantha
Saamantha

కోపం ని తట్టుకోలేదు, అలాగే ప్రేమని కూడా తట్టుకోలేదు.ఈ రెండిటిలో ఏది జరిగిన ఆమె కళ్ళలో నుండి నీళ్లు వచ్చేస్తాయి.అంత సెన్సిటివ్ మనిషి అన్నమాట.నిన్న ఈమె ప్రముఖ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఒక స్టోరీ ని షేర్ చేసింది.ఈ స్టోరీ లో నందిని రెడ్డి తో తనకి ఉన్న అనుబంధం గురించి చెప్పుకొస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు ఎంతో ఎమోషనల్ గా చెప్తుంది.

Samantha Nadhini

ఆమె మాట్లాడుతూ ‘నీలాంటి స్నేహితురాలు ప్రతీ ఒక్కరి జీవితం లో ఉంటే అసలు ఎవరికీ కూడా బాధ అనేదే ఉండదు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ముఖం మీద చిరు రప్పించేది నువ్వు ఒక్కటే. నేను ఏడుస్తున్న సమయం లో కూడా నన్ను నవ్వించే ప్రయత్నం చేస్తావు. ఆ దేవుడు నీలాంటి స్నేహితురాలిని నాకు ఇచ్చినందుకు నేను అదృష్టవంతురాలిని.లవ్ యూ ..హ్యాపీ బర్త్డే’ అంటూ సమంత ఎంతో ఎమోషనల్ గా పెట్టిన ఆ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

- Advertisement -
Samantha Baby Movie

నందిని రెడ్డి తో గతం లో ఆమె ‘జబర్దస్త్’ మరియు ‘ఓ బేబీ’ వంటి సినిమాలు చేసాడు. వీటిలో జబర్దస్త్ అట్టర్ ఫ్లాప్ సినిమా అవ్వగా, ఓ బేబీ మాత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నటి సమంత ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది ఈ చిత్రం. సమంత ప్రస్తుతం హిందీ లో అమెజాన్ ప్రైమ్ సంస్థ తెరకెక్కిస్తున్న ‘సీతా డెల్’ లో నటిస్తుంది.. ఈ సిరీస్ రెగ్యులర్ షూటింగ్ లో చురుగ్గా పాల్గొంటున్న సమంత త్వరలోనే విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న ‘ఖుషి’ మూవీ సరికొత్త షెడ్యూల్ లో పాల్గొనబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here