Samantha ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే అక్కినేని నాగ చైతన్య తో ప్రేమాయణం నడిపి అతనిని పెళ్లి చేసుకున్న సమంత, కొంత కాలానికే కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. విడిపోయిన తర్వాత ఇద్దరు ఎవరి పనిలో వారు నిమగ్నమై ముందుకు దూసుకుపోతున్నారు. నాగ చైతన్య సమంత ని పూర్తిగా మర్చిపోయి ముందుకు పోతుండగా, సమంత మాత్రం ఇప్పటికీ కూడా నాగ చైతన్య ని ప్రతీ రోజు తలచుకొని కుమిలిపోతుందని, ఇప్పటికీ మర్చిపోలేకపోతుందని ఇండస్ట్రీ కి సంబంధించిన ఒక సీనియర్ పాత్రికేయుడు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
సమంత , నాగ చైతన్య ఎప్పటికైనా కలుస్తారని, ఇది నేను కుండబద్దలు కొట్టినట్టు చెప్పగలను అంటూ చెప్పుకొచ్చాడు. సమంత ఇటీవల తన సన్నిహితుల వద్ద నాగ చైతన్య ని అనవసరంగా వదులుకున్నానని బాదపడినట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. సమంత ఆ బాధ నుండి ఇంకా బయటకి రాలేదని, అందుకే ఆమె ఆ స్థాయిలో డిప్రెషన్ కి వెళ్లడం వల్ల మయోసిటిస్ కూడా సోకిందని, ఆమె సినిమాల సంఖ్య కూడా అందుకే తగ్గించిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించాడు. నాగ చైతన్య రెండవ పెళ్లి చేసుకుంటే సమంత అతని పీక పిసికి చంపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఆయన చెప్పుకొచ్చాడు. నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ సోషల్ మీడియా లో ఎంతోకాలం నుండి ప్రచారం లో ఉంది.
త్వరలో ఆమెని ఆయన రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడు అని వార్తలు వినిపించాయి. వీళ్లిద్దరు కలిసి వరల్డ్ టూర్స్ వెయ్యడం కూడా మనమంతా చూసాము. అయితే నాగ చైతన్య మాత్రం తమ మధ్య అలాంటిదేమి లేదంటూ పలు ఇంటర్వూస్ లో పరోక్షంగా తెలిపాడు కానీ, స్పష్టంగా తాను శోభిత తో రిలేషన్ లో లేను అని స్పష్టత మాత్రం ఇవ్వలేదు. ఒకవేళ నాగచైతన్య శోభిత ని పెళ్లాడితే సమంత మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అప్పుడప్పుడు సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పరోక్షంగా నాగ చైతన్య ని ఉద్దేశిస్తూ స్టోరీస్ పెడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ సీనియర్ పాత్రికేయుడు చెప్పినట్టుగా సమంత – నాగ చైతన్య మళ్ళీ కలిసిపోతే బాగుంటుంది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కోరుకుంటున్నారు.