టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య మరియు సమంత జంట రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న ఘటన యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రం లోకి నెట్టేసింది. ఇప్పుడు వీళ్లిద్దరు కూడా విడాకులు తీసుకున్నాము అనే విషయాన్నే మర్చిపోయి, ఎవరి కెరీర్ ని వాళ్ళు చూసుకుంటూ బిజీ గా గడుపుతున్నారు.
కానీ వీళ్లిద్దరి గురించి సోషల్ మీడియా లో ప్రతీ రోజు ఎదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంటుంది. రీసెంట్ గా ప్రచారమవుతున్న ఒక వార్త అందరినీ షాక్ కి గురి చేస్తుంది. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంత అఖిల్ తో బాగా క్లోజ్ గా ఉంటూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అఖిల్ తర్వాత నాగ చైతన్య తల్లి లక్ష్మి దగ్గుపాటి తో సమంత కి మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్లిద్దరూ ఇప్పటికీ కలుసుకుంటూనే ఉంటారట.
సమంత ఇప్పటికీ అమెరికా కి వెళ్ళినప్పుడల్లా లక్ష్మి దగ్గుపాటి ని కలిసి వెళ్తుందట. అంత మంచి బాండింగ్ ఉంది వీళ్లిద్దరి మధ్య. అయితే రీసెంట్ గా ఈమె కలిసినప్పుడు నాగ చైతన్య ని తలచుకొని బాగా ఏడ్చేసిందట. ఆ ఇంట్లో ఉండే మనుషులు మొత్తం విచిత్రమైన వాళ్ళని, ఎప్పుడు ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలియదని, ఒకానొక సమయం నా స్వేచ్ఛ ని మొత్తం పోగొట్టుకొని జైలు లో ఉంటున్న ఫీలింగ్ కలిగేదని చెప్పుకొచ్చింది.
ప్రతీ విషయం లో ఆంక్షలు పెట్టేవారని, ముఖ్యంగా అమల పెట్టే కండీషన్స్ ని తట్టుకోలేకపోయేదానిని అని, ఆమె ప్రభావం నాగ చైతన్య మీద కూడా పడి ఆయన కూడా తనని అపార్థం చేసుకోవడం మొదలు పెట్టాడని, అలా మా మధ్య దూరం పెరుగుతూ వచ్చేదని, చివరికి ఇలా విడిపోవాల్సి వచ్చింది అంటూ సమంత ఏడుస్తూ నాగ చైతన్య అమ్మకి చెప్పుకుంది అట. ఈ వార్త ఇప్పుడు లీకై సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.