దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనుకుంటుంది సమంత. అందుకే అవకాశం ఉన్నప్పుడే తెగ ఆస్తులు కొనుక్కుంటోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈమె వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఒక్కో సినిమాకు దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న సమంత భారీగానే ఆస్తులను కూడపెడుతున్నారు.

సమంత హైదరాబాద్‌లో డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిందిట. ఇక దీని విలువ ఏకంగా రూ.7.8 కోట్లు అట. తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని జయభేరి ఆరెంజ్ కౌంటీలోని నల్ల ప్రీతమ్ రెడ్డి నుంచి ఈ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. మొత్తం 6 కార్ పార్కింగ్ స్లాట్స్‌తో ఈ ఫ్లాట్ ఉంది. సూపర్ బిల్ట్ అప్ ఏరియాలో ఈ అపార్ట్‌మెంట్ మొత్తం 7944 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉందని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ ఫర్మ్ CRE Matrix చెప్పింది. ఇందులో 13వ అంతస్తులో 3920 చదరపు అడుగుల ఫ్లాట్, 14వ అంతస్తులో 4024 చదరపు అడుగుల ఫ్లాట్ ఉన్నట్లు పేర్కొంది. సమంత తన అభిరుచికి తగ్గట్టుగా ఇంటీరియర్ ని డిజైన్ చేయించుకుందట. ఈ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయట. అందుకోసం.. మోడ్రన్ మరియు ఎర్త్ ఇంటీరియర్ ఐటెమ్స్ యూస్ చేస్తున్నారట.

ఇటీవలే ముంబయిలో రూ.15 కోట్ల విలువ చేసే రాజభవనం లాంటి అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. సముద్ర తీరంలో విలాసవంతమైన 3 bhk ను కొన్నట్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్‌లో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే నటిగా పేరు సంపాదించుకున్న సమంత.. ఇటీవల గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలంలో లీడ్ రోల్‌లో నటించింది. అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల్ని అంతలా ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే సినిమాలో కూడా నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకుడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.