Samantha : నాగచైతన్య, సమంత మళ్ళీ కలవబోతున్నారా? అంటే అవుననే సమాధానమే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ప్రస్తుతం నెట్టింట దీని గురించే తెగ డిస్కషన్ నడుస్తోంది. అందుకు కారణం తాజాగా జరిగిన ఓ సంఘటనే. టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

పెళ్లయిన నాలుగేళ్లకే మనస్పర్ధలు కారణంగా ఈ జంట విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవర్ లైఫ్ వారు చూసుకొని సింగిల్ గా లీడ్ చేస్తున్నారు. కెరీర్ పరంగా ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉంటే సమంతకి పెట్స్ అంటే చాలా ఇష్టం అనే విషయం తెలిసిందే కదా. చైతూ తో కలిసినప్పుడు ‘హష్’ అనే ఒక కుక్క పిల్లని పెంచుకుంది సమంత. ఆ కుక్కపిల్ల నిత్యం వారితోనే ఉండేది. సమంతకి ఆ కుక్క పిల్ల అంటే చాలా ఇష్టం.

అందుకే విడాకుల తర్వాత కూడా ఆ కుక్క పిల్లని సమంత తనతో పాటే తీసుకొని వెళ్ళిపోయింది. చైతూకి కూడా ఆ కుక్క పిల్ల అంటే ప్రత్యేకమైన అభిమానం. అయితే సమంత మాత్రం తాను పెంచుకున్న పెట్స్ అన్నిటిని కూడా విడాకుల తర్వాత తనతోనే తీసుకొచ్చేసింది. అప్పుడప్పుడు తన పెంపుడు కుక్కలతో ఫోటోలు దిగి వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా సమంత దగ్గర ఉన్న కుక్కపిల్ల నాగచైతన్య దగ్గర కనిపించింది.