Samantha – Naga-chaitanya : హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల మధ్య విడాకులు గురించి అందరికీ తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సమంత-నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్ అని అందరూ అనుకున్నారు. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిగా జీవనం కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంపై రెండు వర్గాలుగా విడిపోయిన అభిమానులు.. సమంతదే తప్పు .. నాగ చైతన్యది తప్పు లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేసుకున్నారు. కాగా.. నాగ చైతన్య మరో అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నారనే సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగ చైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని నాగచైతన్య అభిమానులు చెబుతున్నారు.

అయితే.. విడాకుల తర్వాత ఇద్దరూ తమ తమ జీవితాల్లో బిజీ అయిపోయారు. విడిపోయిన తర్వాత ఈ జంట నేరుగా కలవలేదు. అయితే తాజాగా ఇద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపించారు. ముంబైలో అమెజాన్ ప్రైమ్ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఒరిజినల్ ప్రాజెక్ట్‌ల నుండి నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరు కావాలని ప్రైమ్ ప్లాన్ చేస్తోంది. కరణ్ జోహార్ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించారు. సిటాడెల్ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత హాజరయ్యారు. అలాగే నాగ చైతన్య నటించిన “దూత” వెబ్ సిరీస్ కోసం అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. విడాకుల తర్వాత సమంత, నాగ చైతన్య తొలిసారి ఈ ఈవెంట్‌లో భాగమయ్యారు. వీరిద్దరూ కలిసి దర్శనం ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ సీన్ చూడలేను రా మావా..
మరోవైపు స్టేజ్ పైనే వరుణ్ దావన్ సమంతను హత్తుకుని ముద్దు పెట్టేశాడు. వారిని అలా చూసుకుంటూ.. కరణ్ నడుచుకుంటూ పక్కకు వెళ్లిపోయాడు.. తరువాత అందరూ గ్రూప్ గా వచ్చి ఒకనొకరు షేక్ హ్యాండ్ ఇస్తూ ఫోటో దిగారు. అక్కడితో ఆప్రోగ్రామ్ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే.. ఒకే స్టేజ్ పై నాగచైతన్య, సమంత కలిసారు అనే వార్తలు వట్టి పుకార్లే అని చెప్పాలి. ముందుగా నాగచైతన్య వచ్చి అక్కడి నుంచి అందరిని కలిసి వెళ్లిపోతాడు. ఆ తరువాత సమంత స్టేజ్ పై వస్తుంది. అయితే వాటిని మీడియా ప్రతి నిధిలు ఒకే స్టేజ్ పై సమంత, నాగ చైతన్య కలిసారంటూ వార్తలు రాసుకొచ్చారు. ఏది ఏదైనా.. నిజం చెప్పాలంటే వీరిద్దరూ ఒకే స్టేజ్ పై వచ్చారు కానీ, ఒకరు ముందుగా వచ్చి వెళితే, మరొకరు తరువాత వచ్చారన్న మాట. కథ ఇదైతే.. వేరేగా స్టోరీ బయటకు వచ్చిందన్న మాట.