Samantha : సమంత అంటే ఇష్టపడని అబ్బాయిలు ఉండరు. అందం పరంగా కానీ నటన పరంగా కానీ ఆమెకి సౌత్ మొత్తం కోట్లాది మంది అభిమానులు ఉంటారు. ఆ అభిమానుల్లో కొంత మంది సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఇది కొత్తేమి కాదు, సెలబ్రిటీ అయ్యినంత మాత్రానా మరో హీరో కి కానీ, హీరోయిన్ కి కానీ ఫ్యాన్ కాకుండా ఉండలేరు, వాళ్ళు కూడా మనలాగే సాధారణ మనుషులు కదా.

అయితే ఒక తమిళ హీరో మాత్రం సమంత అంటే పడి చచ్చిపోతుంటాడు. ఇతను తమిళ సినిమా ఇండస్ట్రీ లో దాదాపుగా 12 ఏళ్ళ నుండి ఉన్నాడు. కెరీర్ లో చాలా హిట్స్ అయితే ఉన్నాయి కానీ, అతనిని ఆ హిట్ సినిమాలు మీడియం రేంజ్ హీరో లీగ్ కి మాత్రమే పరిమితం చేసింది కానీ , స్టార్ ని చేయలేకపోయాయి. ఇదంతా పక్కన పెడితే ఇతను సమంత భక్తుడు.

ఆమెతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని, ముద్దు సన్నివేశాలు మరియు రొమాంటిక్ సన్నివేశాల్లో ఆమెతో కలిసి నటించే అవకాశం వస్తే అదృష్టం గా భావిస్తాను అంటూ అనేక ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పుకొచ్చాడు. కానీ దాదాపుగా అందరి హీరోల పక్కన నటించిన సమంత ఇప్పటి వరకు ఈ హీరో తో మాత్రం నటించలేదు. ఇప్పుడు సమంత సినిమాలకు విరామం ఇచ్చింది.

మళ్ళీ తిరిగి ఆమె సినిమాల్లో నటిస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం. కానీ ఈ హీరో మాత్రం ఆమెతో సినిమా చెయ్యాలని, ముద్దు సన్నివేశాల్లో నటించాలని ప్రత్యేకంగా పూజలు చెయ్యిస్తున్నాడట. ఇది పైత్యానికి పరాకాష్ట అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ముద్దు సన్నివేశాల కోసం ఇంత చేస్తున్నాడా, జీవితం లో అసలు అమ్మాయినే చూడనట్టుగా ఇతని ప్రవర్తన ఉందంటూ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
