ఈమధ్య కాలం లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కరోనా తర్వాత జనాలు ఓటీటీ కి బాగా అలవాటు పడ్డారు, ఇక నుండి థియేటర్స్ కి ప్రేక్షకులు రావడం తగ్గిపోతారు అనుకున్నారు. కానీ జనాలు సినిమా బాగుంటే ఒకప్పటి కంటే కూడా ఎక్కువ వసూళ్లు ఇస్తున్నారు, ఎక్కువ టిక్కెట్లు తెంపుతున్నారు. కానీ ఫ్లాప్ అయితే మాత్రం ఎంత పెద్ద హీరో సినిమాని అయినా వారం రోజులకంటే ఎక్కువగా థియేటర్స్ లో ఉండనివ్వడం లేదు ప్రేక్షకులు.

అయితే ఈమధ్య వచ్చిన పెద్ద సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. కానీ చిన్న సినిమాలు మాత్రం పెద్ద హీరోలు సాధించని కొన్ని అరుదైన రికార్డ్స్ ని కూడా నెలకొల్పుతున్నాయి. అందుకు రీసెంట్ ఉదాహరణే శ్రీ విష్ణు హీరో గా నటించిన ‘సామజవరగమనా’ అనే చిత్రం. రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది.

అయితే దానికి తగ్గ వసూళ్లు మొదటి రెండు రోజులు రాలేదు కానీ. మూడవ రోజు నుండి మాత్రం వసూళ్లు బాగా పికప్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూసేందుకు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రానికి చాలా ప్రాంతాలలో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. ఈమధ్య కాలం లో ఇలాంటి కలెక్షన్స్ ఏ సినిమాకి కూడా రాలేదు. ఇకపోతే అమెరికాలో ఇప్పటికే ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ముఖ్యంగా సోమవారం రోజు, అనగా వర్కింగ్ డే ఈ చిత్రానికి అమెరికా లో వచ్చిన వసూళ్లు అక్షరాలా 75 వేల డాలర్లు అట.

ఇది గడిచిన కొద్దీ సంవత్సరాల నుండి విడుదలైన పెద్ద స్టార్ హీరోల సినిమాల వసూళ్లకంటే ఎక్కువే అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మరియు మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రాలు సోమవారం రోజు కేవలం 45 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసింది. కానీ ‘సామజవరగమనా‘ చిత్రం మాత్రం ఏకంగా 75 వేల డాలర్లు రాబట్టింది అంటే, ఈ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.