‘సామజవరగమనా ‘ 2 రోజుల వసూళ్లు.. హిట్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ లేవు.. ఇదేమి దరిద్రమో!

- Advertisement -

ఈ వారం విడుదలైన రెండు సినిమాలలో అద్భుతమైన పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న చిత్రం ‘సామజవరగమనా’. శ్రీ విష్ణు హీరో గా నటించిన ఈ సినిమా క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ గా టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత మన టాలీవుడ్ నుండి వచ్చిన సినిమా ని చూసి కడుపుబ్బా నవ్వుకున్నాము అంటూ ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ చెప్పుకొచ్చారు. కానీ ఈ సినిమాకి మాత్రం వసూళ్లు రావడం లేదు, ఎంత బాగుంది అని టాక్ వచ్చిన జనాలు కదలడం లేదు.

సామజవరగమనా
సామజవరగమనా

సినిమా విడుదలకు రెండు రోజుల ముందే ప్రీమియర్ షో వేశారు. ఈ షో నుండి అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం, అలా విడుదలకు ముందే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ని దక్కించుకున్న ఈ సినిమాకి మొదటి రోజు కేవలం కోటి 14 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

వాస్తవానికి వచ్చిన టాక్ కి ఈ వసూళ్లు చాలా తక్కువ అనే చెప్పాలి, కానీ శ్రీ విష్ణు కి మొదటి నుండి ఓటీటీ హీరో అనే మార్కు పడిపోవడం తో, ఈ చిత్రాన్ని కూడా ఓటీటీ లో వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనే మూడ్ లోకి వెళ్లిపోయారు ప్రేక్షకులు. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం రెండవ రోజు ఈ సినిమాకి పెద్ద డ్రాప్స్ లేవు.

- Advertisement -

వాళ్ళ అంచనా ప్రకారం ఈ సినిమాకి రెండవ రోజు 70 నుండి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 3 కోట్ల 20 లక్షల రూపాయలకు జరిగింది. ప్రస్తుతానికి అయితే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఎక్కువగానే ఉంది. కానీ వచ్చిన అద్భుతమైన టాక్ కి ఇది చిల్లర వసూళ్లే అని చెప్పాలి. ఈ సినిమాతో తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది అని ఆశపడిన శ్రీవిష్ణు నిరాశ చెందక తప్పదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com