Salman Khan : 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొనేందుకు సల్మాన్ ఖాన్ మంగళవారం గోవా చేరుకున్నారు. సల్మాన్ వ్యక్తిత్వం ఏంటంటే.. ఎక్కడికి వెళ్లినా అతడిపైనే అందరి దృష్టి ఉంటుంది. ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన పై తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో సల్మాన్‌తో పాటు పలువురు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అక్కడ భారీగా జనాలు గుంపు కూడుతారు. ఆ సమయంలోనే సల్మాన్ ఓ మహిళ దగ్గరకు వెళ్లాడు. వెంటనే ఆమెను గట్టిగా పట్టుకుని ముద్దుపెట్టకున్నాడు. ఈ సమయంలో ఆ మహిళ అవాక్కవుతుంది. అనంతరం తేరుకున్న తర్వాత సల్మాన్ తో సరదా సంభాషణ కాసేపు కొనసాగింది.

సల్మాన్ ఆలివ్ గ్రీన్ కలర్ షర్ట్, లేత గోధుమరంగు రంగు ప్యాంటు ధరించాడు. వీడియోలో కనిపిస్తున్న వృద్ధురాలు జర్నలిస్టు, సల్మాన్‌కి పాత స్నేహితురాలు. సల్మాన్ ఆమెను చూడగానే జనం మధ్య మహిళ వద్దకు వచ్చాడు. ఆమె నుదుటిపై ముద్దుపెట్టి కౌగిలించుకున్నాడు. సల్మాన్ కూల్ బిహేవియర్ చూసి చుట్టుపక్కలవాళ్లు నవ్వుకుంటున్నారు. సల్మాన్ నటించిన ‘టైగర్ 3’ దీపావళికి థియేటర్లలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు రూ.376 కోట్లు వసూలు చేసింది. సల్మాన్ ‘టైగర్ 3’లో కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది.