Salman Khan : బాలీవుడ్ లో టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ రప్పించే హీరో ఎవరు అని అడిగితే, అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు సల్మాన్ ఖాన్. ఈయన స్టార్ స్టేటస్ మామూలుది కాదు. విషయం లేని సినిమాలను కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా మార్చిన ఘనత ఆయనది. అయితే ఇదంతా గతం, కరోనా తర్వాత సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ స్టామినా తగ్గిందా అనే సందేహాలు అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి.

కరోనా తర్వాత ఆయన నాలుగు సినిమాలు చేస్తే, నాలుగు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆయన గత నాలుగు చిత్రాల ఎఫెక్ట్ ఇప్పుడు ‘టైగర్ 3 ‘ చిత్రం మీద బలంగా పడింది. ఈ సినిమా ఓపెనింగ్స్ విషయం లో జవాన్ మరియు పఠాన్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది అని అనుకున్నారు అందరూ.

కానీ అంచనాలు మొత్తం తారుమారు అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఆ రెండు సినిమాల రేంజ్ లో అసలు లేదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే మొదటి రోజు ఈ చిత్రానికి 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అదంతా పక్కన పెడితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పై ప్రభావం పడేందుకు సల్మాన్ ఖాన్ గత చిత్రాలు ఒక కారణం అయితే, ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో లో సిగరెట్ తాగుతూ కనిపించడం.

కోట్లాది మంది చూస్తున్న ఒక షోలో అలా సిగరెట్ త్రాగుతూ యువతకి ఏమి సందేశం ఇస్తున్నావు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ రెచ్చిపోయారు.ఆ ప్రభావం కూడా బలంగా పడిందని, వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టే సత్తా ఉన్న సినిమా 600 కోట్ల రూపాయిల వద్దకి ఆగిపోతాడని, సాలిడ్ గా 400 కోట్లు నష్టం అంటూ కామెంట్ చేస్తున్నారు.
