Salman Khan – Katrina Kaif : మూవీ ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది టైగర్-3 యాక్టర్స్. ముంబయిలోని ఓ థియేటర్ కు వెళ్లిన సల్మాన్- కత్రినా అక్కడ డ్యాన్స్ తో రచ్చ చేశారు. అలానే.. ఫ్యాన్స్ తో ముచ్చటించారు. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్- కత్రినా ప్రధాన పాత్రలో నటించిన మూవీ టైగర్- 3. ఇటీవలే రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ అందుకుని వసూళ్లు సాధిస్తోంది.

ముంబయిలోని థియేటర్‌కు వెళ్లి అక్కడ ఫ్యాన్స్ తో ముచ్చటించారు సల్మాన్- కత్రినా జంట. ఫ్యాన్స్ కోరిక మేరకు టైగర్-3 లోని సాంగ్ కు స్టెప్పులేసింది ఈ జంట. దీనికి సంబంధించిన వీడియోను యశ్ రాజ్ ఫిల్మ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
ఫ్యాన్స్ ఇంటరాక్షన్ తో సల్మాన్ మాట్లాడుతూ.. యాక్షన్ హీరోగా ఉన్నందుకు గర్వపడుతున్నానన్నాడు. ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న అభిమానం తన అదృష్టమన్నాడు. ఈమూవీ కోసం ఫిట్ నెస్ పై ఎక్కువ దృష్టి పెట్టాటన్నాడు. మరోవైపు టైగర్ -3 మూవీ ఐదురోజుల్లో రూ.300 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
Vibe 🔛#Tiger3InCinemas | #LekePrabhuKaNaam pic.twitter.com/o4UQwI0PXO
— Yash Raj Films (@yrf) November 17, 2023