Vijay Devarakonda : ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్నటువంటి పోటీ వాతావరణం లో ఒక కుర్ర హీరో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి, అతి తక్కువ సమయం లోనే సూపర్ హిట్స్ ని అందుకొని యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించడం, స్టార్ హీరోలకు సైతం పోటీ పడడం అనేది కల్లోని మాటే. కానీ అలాంటి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపించాడు ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండ.
ఇతనికి నైజాం ప్రాంతం లో ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ కొంతమంది స్టార్ హీరోలకు కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కుర్ర హీరోకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ముఖ్యంగా తమిళనాడు, కేరళ,ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాలలో విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చిపోతారు యూత్ ఆడియన్స్.
విజయ్ దేవరకొండ కి తమిళనాడు లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో, రీసెంట్ గా జరిగిన ఒక ఉద్దరణ మీ ముందు ఉంచబోతున్నాము. గత ఏడాది ఆయన హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. కానీ ఈ సినిమాకి తమిళనాడు లో దాదాపుగా 12 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వసూళ్లను రీసెంట్ గా వచ్చిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ కూడా అందుకోలేకపోయింది.
ఈ చిత్రానికి ఆ ప్రాంతం లో కేవలం 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇక తెలుగు మరియు హిందీ భాషల్లో ప్రభంజనం సృష్టించిన రణభీర్ కపూర్ ‘ఎనిమల్’ చిత్రం కూడా తమిళనాడు ‘ఖుషి’ మూవీ వసూళ్లను అందుకోలేకపోయింది. గత ఏడాది తమిళ నాడులో అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు సినిమాగా ‘ఖుషి’ నిలిచిందని తమిళనాడు ట్రేడ్ పండితులు చెప్తున్నారు.