Salaar : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ విడుదలైన మొదటి రోజు నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆరంభం వసూళ్లు అద్భుతంగానే ఉంది కానీ , వర్కింగ్ డేస్ లో వసూళ్లు మాత్రం దారుణంగా పడిపోయాయి.
7 వ రోజు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 శాతం కి పైగా థియేటర్స్ రెంట్స్ కూడా రికవర్ అవ్వలేదు. రెండవ వారం థియేటర్స్ అత్యధిక శాతం లేపేసి, చాలా లిమిటెడ్ థియేటర్స్ ని మాత్రమే సలార్ కి కేటాయించారు. జనవరి 1 వ తేదీ న్యూ ఇయర్ కాబట్టి ఆ ఒక్క రోజు ఈ సినిమాకి మంచి వసూళ్లు రావొచ్చు. ఓవరాల్ గా 600 కోట్ల రూపాయిల లోపే కలెక్షన్స్ క్లోజ్ కానున్నాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ అప్పుడే బయటకి వచ్చేసింది. అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాని నెల రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చెయ్యాలి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఆల్ టైం రికార్డు ప్రైజ్ కి ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే ముందు అనుకున్న తేదీ కంటే ఒక పది రోజులు ముందే స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఇప్పిస్తే 80 కోట్ల రూపాయిలు అదనంగా ఇస్తామని ఆఫర్ ఇచ్చారట.
ఈ ఆఫర్ మూవీ టీం కి బాగా నచ్చడం తో వెంటనే ఓకే చెప్పేసారు. జనవరి 12 వ తేదీ అర్థరాత్రి నుండి ఈ సినిమా తెలుగు , హిందీ, తమిళం , మలయాళం మరియు కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకి రానుంది. ఓటీటీ వెర్షన్ లో ఎడిటింగ్ లో డిలీట్ చెయ్యబడ్డ సన్నివేశాలను కూడా యాడ్ చేస్తారట.