Salaar : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ గత చిత్రాలు ‘కేజీఎఫ్’ సిరీస్ ఇండియా లో ఉన్న అన్నీ భాషల్లోనూ సంచలన విజయం సాధించి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.

అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తీసిన ప్రశాంత్ నీల్ నుండి రాబోతున్న సినిమా కావడం తో, ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన రోజు నుండే అంచనాలు ఆకాశాన్ని అంటే రేంజ్ లో ఏర్పడ్డాయి. ఈ స్థాయి అంచనాలు ఉన్నాయి కాబట్టి సినిమా కూడా అదే రేంజ్ లో ఉండాలి. అందుకే ఔట్పుట్ విషయం లో ఎక్కడా తక్కువ కాకూడదు అనే ఉద్దేశ్యం తో సెప్టెంబర్ 28 న విడుదల కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ 22 వ తారీఖుకు వాయిదా పడింది.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని డిసెంబర్ 1 వ తేదీన విడుదల చేస్తున్నారు. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టెస్టింగ్ కోసం ప్రైవేట్ స్క్రీనింగ్ లో సలార్ ట్రైలర్ ని వేసుకొని చూసారు మేకర్స్. ఆ స్క్రీనింగ్ లో ప్రభాస్ కి సంబంధించిన షాట్ ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. ఈ షాట్ లో ప్రభాస్ లుక్స్ ని చూసి అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు. ఈ ట్రైలర్ లో ప్రభాస్ ని డైరెక్టర్ ఊర మాస్ ఎలివేషన్స్ తో చూపించాడట.

ముఖ్యంగా కొన్ని యాక్షన్ బిట్స్ ని చూస్తే ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో ఈ సన్నివేశాలను చూస్తామా అనే రేంజ్ ఆత్రుత కలుగుతుందట. ఆ స్థాయిలో ట్రైలర్ ఉంటుందని అంటున్నారు. అయితే అన్నీ భాషలకు కలిపి ఒకే ఆడియో అంటున్నారు అంటే, డైలాగ్స్ ఇంగ్లీష్ లో ఉంటాయని అర్థం అవుతుంది. చూడాలి మరి ఈ ట్రైలర్ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి ఏ రేంజ్ కిక్ ఇవ్వబోతుందో అనేది.
