Salaar Movie Collections : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ చిత్రం రీసెంట్ గానే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న గాక మొన్న విడుదలైనట్టు అనిపిస్తున్న ఈ సినిమా వచ్చి అప్పుడే వారం రోజులు అయ్యింది. ఈ వారం రోజుల్లో ఈ సినిమా సృష్టించిన బాక్స్ ఆఫీస్ సునామి మామూలుది కాదు. చాలా ప్రాంతాలలో #RRR రికార్డ్స్ ని సైతం బ్రేక్ చేసింది.
మొదటి 5 రోజులు అద్భుతమైన వసూళ్లు రాబట్టినప్పటికీ, ఆరవ రోజు మరియు 7వ రోజు మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. 7 వ రోజు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్నీ థియేటర్స్ లో రెంట్స్ ని కూడా రికవర్ చెయ్యలేని పరిస్థితికి వచ్చేసింది. అయితే మొత్తం మీద వారం రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో చూద్దాం.
నైజాం ప్రాంతం లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 65 కోట్ల రూపాయలకు జరిగింది. మొదటి వారం లో ఈ చిత్రానికి ఇక్కడ 61.58 కోట్ల రూపాయిలు వచ్చాయి. ఈరోజు లేదా రేపటి లోపు బ్రేక్ ఈవెన్ అయిపోవచ్చు. కానీ మిగిలిన ప్రాంతాలలో మాత్రం బ్రేక్ ఈవెన్ అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఉత్తరాంధ్ర లో వారం రోజులకు 13 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టిన ఈ చిత్రం, సీడెడ్ లో 17 కోట్లు, ఈస్ట్ గోదావరి లో 9 కోట్లు, వెస్ట్ గోదావరి లో 6 కోట్లు, గుంటూరు జిల్లాలో 8 కోట్ల 50 లక్షలు, కృష్ణా జిల్లాలో 6 కోట్ల 52 లక్షలు అలాగే నెల్లూరు జిల్లాలో 4 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.
వీటిలో ఈస్ట్ గోదావరి , ఉత్తరాంధ్ర మరియు గుంటూరు జిల్లాలో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. మిగిలిన చోట్ల భారీ నష్టాలు తప్పేలా లేవు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 128 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 256 కోట్ల రూపాయిల షేర్, 480 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.