SaiPallavi గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మలయాళీ బ్యూటీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఫిదా సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. హీరోయిన్లందరూ తమ అందాలను ప్రదర్శించి అవకాశాలు దక్కించుకుంటే..ఆమె చిత్తశుద్ధి, అంకితభావం ప్రదర్శించి అవకాశాలను అందుకుంటుంది. అంతేకాదు ఇటీవల సాయి పల్లవి సినీ పరిశ్రమకు దూరమైంది.
![SaiPallavi](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/08/sai-pallavi1-1024x779.webp)
ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలకు కమిట్ అవుతోంది. తాజాగా సాయి పల్లవి తమిళంలో రెండు, తెలుగులో రెండు సినిమాలకు ఓకే చెప్పింది. అయితే ఈ క్రమంలో సాయి పల్లవి కొత్తగా కమిట్ అయిన సినిమాలకు కొత్త కండిషన్స్ పెడుతుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు సినిమాలో అసభ్య పదాలు వాడొద్దని చెప్పిన సాయి పల్లవి తాజాగా తన సినిమాకు కమిట్ అవ్వాలి అంటే ముందుగా వర్క్ షాప్ చేయాల్సిందే అని అంటోంది.
![sai pallavi Photos](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/02/sai-pallavi-1024x768.webp)
దీనివల్ల ఎలాంటి సీన్స్ ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలనే విషయంలో గెటప్ లుక్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయని సాయిపల్లవి చెప్పుకొస్తుదట. సాధారణంగా ఎవరైనా తమ భద్రత కోసం షరతులు పెడతారు. సాయి పల్లవి మాత్రం తన సినిమా బాగా ఆడాలని కండిషన్స్ పెడుతుంది. హీరోయిన్‌కి ఇంతకంటే ఏం కావాలి అంటున్నారు జనాలు..!!