Saindhav Movie Trailer : విక్టరీ వెంకటేష్ చాలా కాలం తర్వాత సోలో హీరో గా మన ముందుకు రాబోతున్న చిత్రం ‘సైంధవ్’. విక్టరీ వెంకటేష్ 75 వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల సంక్రాంతి కానుకగా జనవరి 13వ తారీఖున గ్రాండ్ గా విడుదల కాబోతుంది. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం లో కూడా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా మీద అభిమానుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు.

చాలా కాలం తర్వాత వెంకటేష్ అభిమానులతో పాటుగా మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది ఈ చిత్రం. దానికి తోడు ‘హిట్’ సిరీస్ తో వరుసగా విజయాలను అందుకున్న శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కావడం తో ఈ సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం.

ఈ ట్రైలర్ కి అటు వెంకటేష్ ఫ్యాన్స్ నుండి మాత్రమే కాదు, ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తన కూతురుని బ్రతికించుకోవడం కోసం తాపత్రయం పడే తండ్రి పాత్రలో ఇందులో వెంకటేష్ కనిపించబోతున్నాడు అనే విషయం అర్థం అవుతుంది. ఆయన కూతురు బ్రతకాలంటే దాదాపుగా 17 కోట్ల రూపాయిల విలువ చేసే ఇంజక్షన్ అవసరం ఉంటుంది అని డాక్టర్లు చెప్తారు. ఒక ఇంజక్షన్ ధర 17 కోట్లా..?, ఇది మరీ విచిత్రం గా ఉంది, అతి అనిపించట్లేదా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కానీ నిజంగానే ‘జోల్ గెంస్మా’ అనే అరుదైన వ్యాధి తగ్గాలంటే ఒక ఇంజక్షన్ డోస్ కి 17 కోట్ల రూపాయిలు అవుతుందట. ఇక పోతే ఈ ట్రైలర్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మొత్తం జాన్ విక్ మూవీ సిరీస్ రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా వెంకటేష్ ఒక షాట్ లో విలన్ నోట్లో గన్ పెట్టి కాలిస్తే శరీరం లోపలకు చొచ్చుకుపోయి క్రింద నుండి బులెట్ వస్తుంది. ఈ షాట్ అదిరిపోయింది అనే చెప్పాలి. అలా ఈ ట్రైలర్ లో చాలా షాట్స్ ఉన్నాయి. ఈ సినిమాలో హాట్ హీరోయిన్ యాండ్రియా జెరెమియా విలన్ రోల్ లో నటించగా, తమిళ హీరో ఆర్య ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు.
