Saindhav : ఈ సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమాలలో ఒకటి విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘సైంధవ్’ చిత్రం.వెంకటేష్ 75 వ చిత్రం గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా పై అభిమానుల్లో విడుదలకు ముందు అంచనాలు భారీ లెవెల్ లో ఉండేవి. అందులోనూ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేని శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకుడు అవ్వడం, ప్రస్తుతం యూత్ మొత్తం ఎగబడి చూస్తున్న యాక్షన్ జానర్ కావడం తో ఈ చిత్రం కచ్చితంగా సక్సెస్ అవుతుంది అనుకున్నారు.
కానీ విడుదల తర్వాత అంచనాలు మొత్తం తారుమారు అయ్యాయి. మంచి టాక్ అయితే వచ్చింది కానీ, జనాలను థియేటర్స్ వైపుకి తీసుకొని రావడం లో మాత్రం విఫలం అయ్యింది ఈ చిత్రం. కారణం సంక్రాంతికి ఇలాంటి సినిమాలు ఆడవు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇక ఇప్పుడు ఈ సినిమాకి దాదాపుగా అన్నీ ప్రాంతాలలో షేర్ వసూళ్లు రావడం ఆగిపోయాయి. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమాకి ఫుల్ రన్ లో ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా పాతిక కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ క్లోసింగ్ లో జీఎస్టీ లేకుండా ఈ చిత్రానికి కనీసం 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.
వాళ్ళు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకి 7 కోట్ల 60 లక్షల రూపాయిల వర్త్ థియేట్రికల్ షేర్, అలాగే రిటర్న్ జీఎస్టీ తో కలిపి 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. విక్టరీ వెంకటేష్ ఈ సినిమాకి దాదాపుగా 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఆయనకీ ఇచ్చిన రెమ్యూనరేషన్ ని కూడా రాబట్టలేకపోయిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.