Gayatri Gupta : సినిమా ఇండస్ట్రీ అనేది రంగు ప్రపంచం. పేరుకు తగ్గట్లే అందులో నెగ్గుకు రావాలంటే సమయానికి తగ్గట్లు మారాల్సిందే. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అప్పుడే వారిని కొంతకాలం పాటు ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. మరి కొందరు నేమ్ రాకపోతే ఇండస్ట్రీ నుంచి కనుమరుగవుతూ ఉంటారు. కానీ కొందరు నేమ్, ఫేమ్ రెండూ ఉన్నా కొన్ని పరిస్థితుల కారణంగా ఫేడవుట్ అవుతుంటారు. అలాంటి వారిలో నటి గాయత్రి గుప్తా ఒకరు. ఈమె సాయి పల్లవి నటించిన ఫిదా సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో పాపులారిటీ అయితే బాగానే తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించే అవకాశాలు వచ్చాయి. ఈ సమయంలోనే క్యాస్టింగ్ కౌచ్, బిగ్ బాస్ షోపై పలు రకాల కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.
ఇది ఇలా ఉంటే తాను కొద్ది రోజులుగా ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించింది. ఇటీవల ఈమె నటించిన ఫ్లాట్ అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ చాట్ నిర్వహించింది. అందులో ఈమె ఫేస్ చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అనారోగ్య కారణంగా తాను గుర్తు పట్టలేనంతగా మారిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గాయత్రి గుప్తా ఈ వీడియోలో మునపటిలా లేదు చాలా మారిపోయింది. తాను నటించిన ఫ్లాట్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకే వెళ్దాం అనుకున్నాను.. కానీ కుదరలేదంటూ కన్నీటి పర్వంతం అయింది. ఈ వీడియోలో గాయత్రి చాలా బోల్డ్ గా కనిపించి.. అందరికీ షాక్ కు గురిచేసింది. గతంలో కూడా ఈమె తనకు డిప్రెషన్ వల్ల వచ్చే శారీరక వ్యాధి గురించి చెప్పింది. ఈ వ్యాధికి తన దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవంటూ.. దాతలు సాయం చేయాలని కోరింది. దీంతో ఆమె అభిమానులు తను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.