ఇలా అయితే సాయిపల్లవికి పెళ్లి అవ్వడం కష్టమే భయ్యా..

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. ఆమె అంద చందాలతో పాటు నటన కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఇప్పటి జనరేషన్ లో ఇండస్ట్రీలో ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా నటించిన ఏకైక హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పవచ్చు. అలాంటి సాయి పల్లవి మలయాళం లోని ప్రేమమ్ చిత్రంతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఫిదా సినిమాతో మెగా హీరో వరుణ్ తేజ తో జత కట్టింది తెలుగు తెరకు పరిచయమైంది.ఈ సినిమా ద్వారా ఆమె మంచి గుర్తింపు సాధించింది.

సాయి పల్లవి

ఈ మధ్యకాలంలో సాయిపల్లవి (Sai Pallavi) ఓ సినిమాకి ఎస్ చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోయి విడుదలయ్యాక కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లో వాళ్లకి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అప్పటివరకు తన పెళ్లి గురించి మాట్లాడకూడదని కండిషన్ పెట్టిందట. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది ముందు ముందు తెలుస్తుంది. ఇప్పటికే ముప్పై ఏళ్లు పైగా ఉన్న సాయి పల్లవిని ఇంట్లో వాళ్ళు సినిమాలు పక్కన పెట్టి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారట.

కానీ సాయి పల్లవి మాత్రం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదట. రీసెంట్ గా ఒక సంబంధం వస్తే దాన్ని ఆమె రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వచ్చిన సంబంధం కూడా బడా బిజినెస్ మ్యాన్ అయినట్టుగా తెలుస్తోంది. కానీ సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ఇక సాయి పల్లవి ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా గ్లామరస్ పాత్రల్లో నటించకుండా సావిత్రి సౌందర్య లాగా సాంప్రదాయబద్ధమైన పాత్రల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈరోజుల్లో ఇలాంటి హీరోయిన్ ఉండడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here