Sai Pallavi ఈ చిన్నదాని అందానికి.. నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది. తెలుగులో ఫిదా సినిమాతో పరిచయం అయ్యింది. సాయి పల్లవిని చూస్తే తెలుగమ్మాయే అనుకుంటారు. పక్కింటి అమ్మాయిలా ఉండే సాయి పల్లవి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఫిదా సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి అలరించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ చిన్నది.. సాయి పల్లవిని తెలుగు ఆడియన్స్ దివంగత నటి సౌందర్యతో పోల్చుతూ ఉంటారు.

గ్లామర్ పాత్రలను నో చెప్తూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది సాయి పల్లవి. ఇటీవల కొంత కాలం సినిమాలకు గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి తాజాగా అక్కినేని నాగ చైతన్యతో సినిమా చేస్తుంది. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. మత్యకారుల జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే సాయి పల్లవి పుష్ప సినిమాలో నటిస్తుందని కూడా వార్తలు వచ్చాయి. పుష్ప 2లో సాయి పల్లవి నటిస్తుందన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.

ఇక సాయి పల్లవి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్పెషల్ సాంగ్స్ చేయడం పై క్లారిటీ ఇచ్చింది. రంగస్థలంలో పూజాహెగ్డే, పుష్ప సినిమాలో సమంత లా స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వస్తే చేస్తారా అని యాంకర్ అడగ్గా.. నేను స్పెషల్ సాంగ్స్ లో అంత కంఫర్ట్ బుల్ గా ఉండను.. నేను స్పెషల్ సాంగ్స్ చేయను అని చెప్పేసింది సాయి పల్లవి..