Sai Pallavi: ఆ విషయంలో స్టార్ హీరోలను కూడా వెనక్కి నెట్టిన సాయిపల్లవి.. న్యాచురల్ బ్యూటీనా మజాకా

- Advertisement -

 

Sai Pallavi: ప్రస్తుతం ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అంటే సాయిపల్లవినే. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. హద్దుల్లేకుండా అందాలను చూపిస్తేనే స్టార్ హీరోయిన్లు అయిపోతారనుకునే ఈ కాలంలో.. టాలెంట్ ఉంటే చాలు అలా చేయాల్సిన అవసరం లేదని నిరూపించింది సాయిపల్లవి. నటనకు ప్రాధాన్యత ఇస్తూ స్టార్ హీరోయిన్‌ అయిపోయింది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌లకు సైతం లేని పాపులారిటీ సంపాదించుకుంది. సాధారణమైన పాత్రల్లో నటిస్తూనే సూపర్ హిట్స్ కొట్టింది.

- Advertisement -

‘ ప్రేమమ్’ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సాయిపల్లవి.. ఆ తర్వాత ‘ ఫిదా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. పలు సినిమాల్లో నటించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. చివరగా ‘విరాటపర్వం’లో కనిపించింది. ఇది వచ్చి నాలుగేళ్లుపైనే అయిపోయింది. తను తెరపై కనిపించి రెండేళ్లు అవుతుంది. ఇంత కాలం నటనకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ బిజీగా మారుతోంది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తుంది. హిందీలో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న సినిమాలో నటిస్తోంది. తెలుగులో నాగచైతన్యతో కలిసి తండేల్ సినిమా చేస్తుంది. నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇది. దాదాపు 100కోట్లతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అలాగే హిందీలో భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘ రామాయణ’ మూవీలో నటిస్తోంది. అయితే ఇందులో నటిస్తున్నందుకు సాయిపల్లవి కళ్లుచెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అలానే రణ్ బీర్, యష్ తదితరులు నటిస్తున్న ‘ రామాయణ’లోనూ సీత పాత్రలో నటించనుంది. త్వరలో ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగు కొనసాగుతుంది. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సాయిపల్లవి.. మూడు భాగాలుగా తీస్తున్న ‘రామాయణ’ కోసం మాత్రం రూ50 కోట్ల వరకు పారితోషకంగా తీసుకుంటుందని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నయనతారని దాటేసి రికార్డ్ క్రియేట్ చేసినట్లే. సీత పాత్రకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా తన రెమ్యునరేషన్ ను సాయిపల్లవి అమాంతం పెంచేసిందని అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here