Sai Pallavi : పార్టీలో సాయిప‌ల్ల‌వి.. అదికూడా జ‌పాన్ వాళ్ల‌తో అందేంటి!

- Advertisement -

Sai Pallavi : ‘సాయి పల్లవి’కి ఉన్న ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో వెండితెర పై అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అలా తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడంతో పాటు లక్షలాది మంది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సాయి పల్లవికి ఓ స్టార్ హీరో రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇక చిన్నదాని నటనతో పాటు డాన్స్ కూడా ఎంతో ఆద్భుతంగా చేస్తుంది. అసలు సినిమాలో హీరోలకు పోటీగా సాయి పల్లవి తన డాన్స్ తో అదరగొడుతుంది. పైగా ఈమె డాన్స్ కు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నెమలి నాట్యంలా చిందులు వేసే ఈ ముద్దుగుమ్మ డాన్స్ చూస్తుంటే.. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక ఎంతో నేచలెర్ గా నటించి నటన, ఆద్భుతమైన డాన్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే అంటారు ఈ లేడీ పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే తాజాగా ఈ చిన్నదానికి సంబంధించి ఓ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అందులో సాయి పల్లవి డాన్స్ చూస్తే వావ్ అనాల్సిందే.

Sai Pallavi

తాజాగా సాయి పల్లవి అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం జపాన్‌లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ చిత్ర బృందం చేసుకున్న ఓ పార్టీలో సాయి పల్లవి తన డ్యాన్స్ తో అదరగొట్టేశారు. తనదైన స్టెప్పులతో మరోసారి అందరిని కట్టిపడేశారు. ఇక ఫ్రెండ్స్ తో కలిసి ఈ బ్యూటీ చేసిన డాన్స్ చూస్తే.. వావా అనిపిస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన సాయి పల్లవి ఫ్యాన్స్ ఆమె డాన్స్ కు మరొసారి ఫిదా అయిపోయారు. ఇక సాయి పల్లవి తెలుగులో నాగచైతన్య సరసన ‘తండేల్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక తండేల్ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అర్జున్ సమర్పణలో బన్నీ వాసు తెరకెక్కిస్తున్నారు. అలాగే సాయి పల్లవి మరోవైపు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి రామాయణంలో నటించనున్నారు. అలాగే ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వం వహించనున్నారు. పైగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలను శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న ప్రకటించనున్నట్లు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here