Sai Pallavi : హీరోయిన్ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఫిదా సినిమాతో ఆరంగేట్రం చేసిన ఈ హైబ్రిడ్ పిల్ల కుర్రాళ్ల మనసులను దోచేసింది. ఈ నటి తన అందం, నటన, చలాకీ తనంతో మన ఇంటి పిల్లలా అనిపించుకుని ఎంతో మందిని ఆకట్టుకుంది. ఫిదా సినిమా తర్వాత వరుస సినిమా ఛాన్సులు వచ్చాయి. అయినా తనకు నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటూ.. సినిమా సక్సెస్ లు సాధిస్తూ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ముఖ్యంగా సినిమాల్లో కూడా కొన్ని కండీషన్స్ పెట్టుకొని నటించడం, ఎక్కువ రొమాంటిక్ సీన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో జనాలకు సాయిపల్లవి పై మరింత గౌరవం ఏర్పడింది. దీంతో ఆమె క్యారెక్టర్ కు సైతం అభిమానులు ఏర్పడ్డారు. అయితే సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో నటించబోతుంది. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న రామాయణంలో సీత పాత్రలో నటిస్తోంది.
ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు మేటరేంటంటే.. సాయిపల్లవి తన కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ ఎదుర్కొన్నదట. టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్ ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలంటే కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలని అడిగాడట. పడక సుఖం అందిస్తేనే తన సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తానని చెప్పాడంట. దీంతో ఒక్కసారిగా షాకైన నటి, భయపడకుండా ఆ దర్శకుడికి లెఫ్ట్ అండ్ రైట్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందంట.
కమిట్మెంట్ కావాలా.. నీపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను.. నిన్ను బజారు కీడుస్తాను అంటూ ఫుల్ ఫైర్ అయ్యిందంట. ఇక సాయిపల్లవి రియాక్షన్ చూసిన డైరెక్టర్ ఒక్కసారిగా భయపడిపోయి, సాయిపల్లవికి సారీ చెప్పాడంట. ప్రస్తుతం ఈ న్యూస్ ట్రెండ్ అవుతోంది. ఇలాంటి లక్షణాలు ఉన్న హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలా అరుదు. గ్రేట్ జాబ్ పల్లవి అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆమె అభిమానులు. అంతే కాకుండా, సీత పాత్రకు సాయిపల్లవినే బెస్ట్ ఆప్షన్ అంటూ ఆ సినిమా టీంను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.