టాలీవుడ్ లో గత కొంతకాలం నుండి ఒక రేంజ్ లో ప్రచారం అవుతున్న వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ప్రేమ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చి , రీసెంట్ గానే వీళ్లిద్దరు నిచితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నెలలోనే వీళ్లిద్దరు పెళ్లి పీటలు కూడా ఎక్కబోతుంది ఈ జంట. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో రాజస్థాన్ లో వీళ్లిద్దరి వివాహమహోత్సవం బంధు మిత్రుల సమక్షం లో గ్రాండ్ గా జరగబోతుంది.
అయితే ఈ పెళ్ళికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ డుమ్మా కొట్టబోతున్నాడని గత కొంత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం అప్పుడు కూడా డల్ గా ఉన్నాడని, ఎదో ఫార్మాలిటీ కోసం అలా వచ్చి వెళ్లినట్టుగా అనిపించిందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్.
అసలు విషయం లోకి వెళ్తే గతం లో లావణ్య త్రిపాఠి మరియు సాయి ధరమ్ తేజ్ ప్రేమించుకున్నారని, కానీ కొన్ని అనుకొని కారణాల వల్ల బ్రేకప్ అయ్యిందని, ఆ తర్వాత లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో ప్రేమలో పడిందని ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అయ్యాయి. గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కూడా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కంటే ఎక్కువగా , సాయి ధరమ్ తేజ్ ని హస్బెండ్ మెటీరియల్, నాకు బాగా క్లోజ్ అయిన వాళ్లలో సాయి ధరమ్ తేజ్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చింది.
అప్పటి నుండే ఎదో తేడాగా ఉండే అంటూ సోషల్ మీడియా లో రూమర్స్ మొదలయ్యాయి. ఇప్పుడు తన మాజీ ప్రియురాలు పెళ్లి జరుగుతుండడం తో అది చూడలేక సాయి ధరమ్ తేజ్ ఈ పెళ్ళికి డుమ్మా కొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి మరి.