Sai Dharam Tej : ‘తిక్క’ హీరోయిన్ తో ప్రేమాయణం.. సాయిధరమ్ తేజ్ ఒప్పుకున్నాడుగా

- Advertisement -

Sai Dharam Tej : 2016లో వచ్చిన ‘తిక్క’ సినిమాలో సాయి ధరమ్ తేజ్.. ‘లారిస్సా బొనెసి’ తో కలిసి నటించాడు. ఈ మూవీ సమయంలో తేజ్, లారిస్సాతో ప్రేమలో పడ్డాడని, తన ప్రేమని కూడా ఆమెకు తెలియజేశాడని వార్తలు వచ్చాయి. ఇక 2021లో సాయి ధరమ్ తేజ్ బర్త్ డే రోజున లారిస్సా.. “నేను ప్రేమలో ఉన్నాను” అంటూ ట్వీట్ చేసింది. గత ఏడాది పుట్టినరోజున తేజ్ కి శుభాకాంక్షలు తెలియజేయగా.. ‘టూ మై డిస్ట్రబన్స్‌’ అని ప్రేమగా రిప్లై ఇచ్చాడు మన హీరో. దీనికి లారిస్సా.. “ఎప్పటికి నిన్ను డిస్ట్రబ చేస్తూనే ఉంటా” అంటూ రిప్లై ఇచ్చింది.

Sai Dharam Tej
Sai Dharam Tej

దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కాగా సాయి ధరమ్ తేజ్ బ్రో ప్రమోషన్స్ లో బాగా చేశాడు. దీంతో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే తేజ్ అండ్ హీరోయిన్ కేతిక శర్మ సోషల్ మీడియా మీమర్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ఇంటరాక్షన్ మూవీ విషయాలతో పాటు పలు ఫన్నీ క్యూస్షన్ లు కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే ఒక మీమర్, తేజ్‌ని.. “లారిస్సా వదిన ఎలా ఉంది అన్న” అంటూ ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నకు తేజ్ బదులివ్వకుండా కాసేపు మౌనంగా ఉండి, ఆ తరువాత.. ‘క్యూస్షన్ ఏంటి నాకు సరిగా అర్ధం కాలేదు” అంటూ మళ్ళీ అడిగాడు. మీమర్ మళ్ళీ ఆ క్యూస్షన్ ని రిపీట్ చేయగా తేజ్ మళ్ళీ మౌనం పాటించి క్యూస్షన్ అర్ధం కాలేదంటూ బదులిచ్చాడు. ఇక ఈ వరుస చూసిన కొందరు మీమ్ లాంగ్వేజ్ లో ‘కమల్ హాసన్’ అంటూ కామెడీ చేశారు. దానికి తేజ్ బదులిస్తూ.. “లారిస్సా పేరులో ఉన్న వైబ్రేషన్ అలాంటిది” అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here