Sai Dharam Tej : ఇండస్ట్రీ లో ఒకప్పుడు గొప్పగా రాణించిన ఆర్టిస్టులు ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు లేక , పూట కూడా గడవని పరిస్థితిలో ఎంతో మంది ఉన్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. వారిలో పావలా శ్యామల కూడా ఒకరు. ఒకానొక దశలో ఈమె చేతిలో వరుసగా సినిమాలు ఉండేవి. ఈమె లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదేమో. కానీ ఆ తర్వాత ఈమెకి అనారోగ్యం కారణంగా అవకాశాలు చేజారిపోయాయి. తీవ్రమైన కష్టాల్లో పడిన ఆమెని ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్పట్లో ఆమెకి ఆర్ధిక సహాయం చేసాడు. పవన్ కళ్యాణ్ ని చూసి మరికొంత మంది ఆమెకి ఆర్ధిక సహాయం చేసారు.
అయితే ఇప్పటికీ కూడా ఆమె ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎంతో ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఆమెకి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రూపం లో లక్ష రూపాయిలు ఆర్ధిక సాయం అందింది. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ ఫిలిం ఛాంబర్ కి 5 లక్షల రూపాయిలు డొనేషన్ అందించాడు. వీటిలో లక్ష రూపాయిలను పావలా శ్యామల కి అందించారు ఫిలిం ఛాంబర్ సభ్యులు. ఈ సందర్భంగా పావలా శ్యామలా సాయి ధరమ్ తేజ్ కి, ఫిలిం ఛాంబర్ కి కృతఙ్ఞతలు తెలుపుతూ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
సాయి ధరమ్ తేజ్ ఇటీవలే అసభ్య వ్యాఖ్యలు చేసిన ఒక ప్రముఖ యూట్యూబర్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అరెస్ట్ చేయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంఘటన చూసి సాయి ధరమ్ తేజ్ ని సోషల్ మీడియా లో అందరూ పొగడ్తలతో ముంచి ఎత్తారు. ఆయనకీ సోషల్ మీడియా లో ఈ సంఘటన మంచి పాజిటివ్ ఇమేజి ని తెచ్చి పెట్టింది. ఈ సంఘటన జరిగిన అతి కొద్దికాలం లోనే పావలా శ్యామల కి ఇలా ఆర్ధిక సహాయం చెయ్యడం కారణంగా ఆయన ఇమేజి మరింత పెరిగింది. ఇకపోతే సాయి ధరమ్ ప్రస్తుతం ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం లో హీరో గా నటిస్తున్నాడు. విరూపాక్ష, బ్రో వంటి చిత్రాల తర్వాత ఆయన నుండి వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇది. ఇక నుండి సాయి ధరమ్ తేజ్ అన్నీ ఇలాంటి భారీ స్కేల్ ఉన్న సినిమాలే చేస్తాడని సమాచారం.