Sai Dharam Tej : చిరంజీవి మేనల్లుడు మరియు సుప్రీమ్ హీరో గా పిలవబడే సాయి ధరమ్ తేజ్ కి 2021 వ సంవత్సరం సెప్టెంబర్ 11 వ తారీఖున కేబుల్ బ్రిడ్జి వద్ద బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. అప్పట్లో సుమారుగా నెల రోజులపాటు ఆయన కోమాలో ఉన్నాడు.ప్రాణాలతో బయటపడుతాడో లేదో అని అందరూ భయపడ్డారు కానీ, కోట్లాది మంది అభిమానుల ప్రార్థనల కారణం గా ఆయన ప్రాంతాలతో సురక్షితంగా బయటపడ్డారు.
బయటకి వచ్చిన తర్వాత ఆయన ‘విరూపాక్ష’ అనే సినిమా చేసాడు.రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఇదంతా పక్కన పెడితే సాయి ధరమ్ తేజ్ ఈరోజు ఇంత ఆరోగ్యంగా, చలాకీగా మన ముందుకు వచ్చాడంటే దానికి కారణం అభిమానుల దీవెనలతో పాటుగా సయ్యద్ అబ్దుల్ సహాయం కూడా ఉంది.
కేబుల్ బ్రిడ్జి మీద వస్తున్న సమయం లో సాయి ధరమ్ తేజ్ బైక్ నుండి స్కిడ్ అయ్యి పడిపోతున్న సంఘటన చూసి వెంటనే ఆయనని రక్షించడానికి ముందుకు వచ్చాడు. అయితే రీసెంట్ పాపం అతనిని రక్షించినందుకు సయ్యద్ ఎన్నో సమయసలు ఎదురుకుంటున్నాడు. ఇతగాడు హైదరాబాద్ నిజాం పెట్లోని CMR లో పని చేస్తూ ఉండే వాడు. అయితే సయ్యద్ కి మెగా ఫ్యామిలీ కి సహాయం చేసిందని, చిరంజీవి లక్ష రూపాయిల డబ్బు ఇచ్చారని ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియా లో వచ్చాయి.
ఇవి సయ్యద్ పాలిట నరకం లాగ మారింది.అక్కడికి వచ్చే ప్రతీ ఒక్కరు నీకు మెగా ఫ్యామిలీ ఎంత ఇచ్చింది అంటూ సయ్యద్ ని ప్రశ్నలు అడుగుతూ ఉంటె ఆ టార్చర్ తట్టుకోలేక ఆయన CMR లో ఉద్యోగం కూడా మానేసి సెకండ్ హ్యాన్డ్ లో ఒక చిన్న కార్ కొనుక్కొని అమెజాన్ కోసం పని చేస్తున్నాడట.
అయితే రీసెంట్ గా విరూపాక్ష మూవీ ఇంటర్వ్యూ లో సాయి ధరమ్ తేజ్ మీకు సహాయం చేసిన సయ్యద్ అబ్దుల్ టచ్ లో ఉన్నాడా అని యాంకర్ అడగగా, దానికి సాయి ధరమ్ తేజ్ సమాధానం చెప్తూ ‘ఉన్నాడు.. అతనికి నేను ఎదో డబ్బులిచ్చేసి చేతులు దులుపుకుందామని అనుకోలేదు. నా ఫోన్ నెంబర్ ఇచ్చి లైఫ్ లో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కాల్ చెయ్యమని చెప్పాను’ అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.
అయితే ఇందులో ఎంతమాత్రం నిజం ఉందొ తెలుసుకోవడానికి ఒక ప్రముఖ మీడియా ముందుకొచ్చింది , సయ్యద్ ని కలిసి సాయి ధరమ్ తేజ్ మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాడంట కదా అని అడుగుతారు. అప్పుడు సయ్యద్ దానికి సమాధానం చెప్తూ ‘నాకు మెగా ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరూ ఎలాంటి సహాయం కూడా చెయ్యలేదు. సాయి ధరమ్ తేజ్ నాకు ఎలాంటి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు.దయచేసి ఫేక్ న్యూస్ పెట్టకండి.గతం లో కూడా ఇలాగే ఫేక్ న్యూస్ పెట్టడం వల్ల CMR లో జాబ్ మానేయాల్సి వచ్చింది. నాలుగు నెలలుగా ఎలాంటి పని దొరకలేదు’ అంటూ సయ్యద్ మాట్లాడిన ఎమోషనల్ మాటలు మీరు కూడా క్రింద చూసేయండి.