Sai Dharam Tej : తను పడ్డ కష్టాలు గురించి తెలిపాడు నటుడు సాయి ధరమ్ తేజ్..‘‘ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక పాయింట్ లో అన్నీ కొలాప్స్ అయిపోతాయి, మన సామ్రాజ్యం మొత్తం కూలిపోతుంది అలా ఎప్పుడైనా జరిగిందా?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు సాయి ధరమ్ తేజ్. “2009 అప్పుడే యాక్టింగ్ ఫీల్డ్ లోకి వస్తున్నాను. 2010లో యాక్టింగ్ కోర్సు అయిపోయి వచ్చాను. 2011-12లో ‘రేస్’ సినిమా ఓపెన్ అయిపోయింది.

ఫైనాన్సియల్ గా చాలా లోగా ఉన్నాను. మీటింగ్ కి వెళ్లాలి. డబ్బులు లేవు. కారులో డీజిల్ కొట్టించాలి. అప్పట్లో ప్రిపెయిడ్ ఫోన్ దాంట్లో బ్యాలెన్స్ కూడా లేదు. పెట్రోల్ కొట్టించాలంటే రూ.500 కావాలి. రూ.450 పెట్రోల్ కొట్టించాలి. రూ.50 తో రీఛార్జ్ చేయించుకోవాలి అని అనుకున్నాను. పెట్రోల్ కొట్టించాను. రూ.50 డ్రా చేయలేం. మినిమమ్ ఉండాలి. ఎలాగో ట్రై చేశాను. బ్యాలెన్స్ చూస్తే రూ. లక్ష నుంచి రూ.రెండు లక్షలు ఉన్నాయి. అర్థంకాలేదు. వెంటనే అమ్మకి ఫోన్ చేశాను.

“రాత్రి నువ్వు అన్నావు కదా డబ్బులు లేవని, అందుకే వేశాను. ఈ నెల గడిచిపోతుంది కదా” అన్నారు. ఏటిఎం నుంచి బయటికి వచ్చి ఏడ్చేశాను. అది అమ్మ పవర్ అంటే. ఎప్పుడు ఏం ఇవ్వాలో అమ్మకే కచ్చితంగా తెలుస్తుంది. అదే అమ్మ గొప్పతనం అని సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు..యాక్సిడెంట్ తర్వాత పవన్ కల్యాణ్ తో నటించిన ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ మంచి విజయం అందుకున్నాడు.ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్ లో ‘గాంజా శంకర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.