Sadha : పెళ్లి చేసుకుంటే ఇలాంటివన్నీ కుదరవు.. అందుకే చేసుకోలేదు: సదా

- Advertisement -

Sadha “వెళ్ళవయ్యా బాబు వెళ్ళు” అంటూ పాపులర్ అయిన హీరోయిన్ సదా.ఈ డైలాగ్ అభిమానులకు గుర్తుండే ఉండి ఉంటుంది. మొదటి చిత్రంతోనే గుర్తింపు రావడం అనేది చాలా కష్టం. అలా గుర్తింపు లభించిన వాళ్ళని అదృష్టవంతులు అనవచ్చు. అలాంటి వారిలో హీరోయిన్ సదా ఒకరు. తేజ దర్శకత్వంలో నితిన్ సరసన సదా జయం అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

Sadha
Sadha

మొదటి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ కూడా సదాని గుర్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ డైలాగ్ ని ఇమిటేట్ చేస్తారు. అంత పాపులర్ అయింది ఈ డైలాగ్. ఈ సినిమా తర్వాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరచుకుంది సదా. ఇటీవల ఆమె తేజ దర్శకత్వంలో అహింస అనే చిత్రంలో నటించింది. ఈమె ఒకపక్క చిత్రాల్లో చేస్తూనే, మరోపక్క టీవీ షోస్ కి న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పెళ్లిపై తన అభిప్రాయాన్ని చెప్పింది. మీరు ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సదా సమాధానం చెబుతూ, తాను పెళ్ళి చేసుకో లేదు కాబట్టే సంతోషంగా ఉన్నానని, పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ మొత్తం పోతుందని, ఆమె చెప్పింది.

సదా కి వైల్డ్ లైఫ్ అంటే చాలా ఇష్టమట. అడవి జంతువులన్నా ఇష్టమట. తనకు ఖాళీ దొరికినప్పుడల్లా అడవికి వెళ్లి జంతువులతో కాలక్షేపం చేస్తూ ఉంటుందట.‘‘పెళ్లి చేసుకుంటే ఇలాంటివన్నీ కుదరవు. మన మనసుల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు,చేసుకోని వారు ఉంటారు.మంచి మనిషి దొరకడం చాలా కష్టం. ఇప్పుడు చూస్తే పెళ్ళిళ్ళు చేసుకున్న అందరూ విడిపోతున్నారు. అందుకే పెళ్లి చేసుకోవడం ఎందుకు? విడిపోవడం ఎందుకు? అని పెళ్లికి దూరంగా ఉన్నాను”అని చెప్తూ, మొగుడు కంటే పశువుల బెటర్ కదా, అంటూ ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here