Bala krishna : ఒకప్పుడు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన నటి విచిత్ర ఇప్పుడు తమిళ బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ అన్న సంగతి మనకు తెలిసిందే. కానీ తాజాగా ఈ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. భలేవాడివి బాసు సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించినప్పుడు తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఇష్టమైన చోట చేతులు వేసేవాడని.. షూటింగ్ అయిపోయాక గదిలోకి రమ్మని బలవంతం చేశాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. విచిత్ర మాటలను వైసీపీ నేతలు ఉపయోగించుకుని బాలకృష్ణపై విరుచుకుపడ్డారు. బాలయ్య క్యారెక్టర్ మంచిది కాదంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు.
గతంలో సావిత్రి సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో మహిళలు, హీరోయిన్లను ఉద్దేశించి బాలయ్య చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్‌గా మారాయి. అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణపై బురద జల్లడం మొదలుపెట్టారు జనాలు. భలేవాడివి బాసు తర్వాత సినిమాలు చేయడం మానేశానని, ఇండస్ట్రీలో అందరూ ఇలాగే ఉంటారేమోనని భయపడ్డానని విచిత్ర చెప్పింది. అయితే వైసీపీ నేతల దాడికి స్పందించిన టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. బాలయ్యకు అండగా నిలిచి విచిత్ర చెప్పినవన్నీ అబద్ధమని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. విచిత్రను వేధించింది బాలయ్య కాదని, 2001లో భలేవాడివి బాసు సినిమాలో నటించినప్పుడు ఆమెను వేధించింది స్టంట్ మాస్టర్ విజయ్ అని, అందుకే 2012లో అతనిపై కేసు కూడా పెట్టిందని టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. టీడీపీ బయటపెట్టిన సాక్ష్యంతో బాలయ్య నిర్దోషి అని తెలుస్తోంది. ఈ విషయంలో బాలయ్యను పక్కన పెడితే.. ఈ ఘటన జరిగి నేటికి 20 ఏళ్లు. ఈ ఉదంతం లాగానే ఇంకా బయటకి రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయని సినీ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.