Bigg Boss 7 Telugu : బుల్లితెరపై సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకుపోయిన టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలో.. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది.. నాలుగు సీజన్లను బాగానే జరుపుకున్న ఈ షో ఐదో సీజన్ లో జనాలను అలరించలేదు.. ఇక ఆరో సీజన్ విమర్శలతో బాగానే ఆకట్టుకుంది.. ఇప్పుడు ఏడో సీజన్ కోసం ఏర్పాట్లను పూర్తి చేశారు.. ఈ సీజన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఈ సీజన్ లో మొత్తం రూల్స్ మార్చినట్లు సమాచారం..

ఇక ఈ సీజన్ కి కూడా వ్యాఖ్యాతగా అక్కినేని నాగార్జున వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట్లో బాలకృష్ణను హోస్టుగా తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన చేయను అని మొహం మీదే చెప్పేసారట. దాంతో నాగార్జున అనే ఈ షో కి దిక్కుగా మారిపోయారు. ప్రోమో షూట్ ని కూడా పూర్తి చేయడం జరిగింది.. ఇటీవలే ప్రోమోను కూడా విడుదల చేశారు.. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్లో చాలా కఠినమైన రూల్స్ ని బిగ్ బాస్ లో పెట్టినట్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు కూడా ఉన్నాయి..
బిగ్ బాస్ లో కంటెంట్స్ కొన్ని సందర్భాలలో మితిమీరి హద్దులు దాటి గొడవలు పెట్టేసుకుంటున్నారు. అలా గొడవలు పెట్టుకుని పొరపాటున నోటి నుండి ఒక బ్యాడ్ పదం కూడా బయటకు వచ్చిన ఆ కంటెస్టెంట్ కి రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక టాస్క్ లు, గేమ్స్ కూడా చాలా కొత్తగా ఆదించునున్నారని టాక్.. అంతేకాకుండా సిరి – షణ్ముఖ్ మధ్య సీజన్ ఫైవ్ లో రొమాన్స్ చూసి ప్రేక్షకులు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. అందుకే ఇలాంటి రొమాన్స్ కి తావు ఇవ్వకుండా చూసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు అని సమాచారం.. ఆగస్టు మొదటి వారంలో ఈ షోను నిర్వహించనున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఆ సీజన్ లో ఎవరు వస్తారోనని జనాలు ఆసక్తిగా కనబరుస్తున్నారు ..