Roshan Kanakala : ఇండస్ట్రీ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంటలలో ఒకటి సుమ మరియు రాజీవ్ కనకాల జంట. వీళ్లిద్దరి తొలి పరిచయం కస్తూరి అనే టీవీ సీరియల్ ద్వారా అయ్యింది. ఆ తర్వాత సుమ టాప్ యాంకర్ అవ్వగా, రాజీవ్ కనకాల మంచి డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా మారాడు. సుమ ఇప్పటికీ ఇండస్ట్రీ లో ఎంత బిజీ యాంకర్ గా కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.

ఈమె లేని ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, ఇంటర్వ్యూ లేదు. ఇదంతా పక్కన పెడితే సుమ – రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల టాలీవుడ్ కి హీరో గా పరిచయం అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయన మొదటి చిత్రం ‘బబ్లీ గమ్’ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా రోషన్ కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు.

ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈరోజు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. గతం లో సుమ మరియు రాజీవ్ కనకాల ఇద్దరూ కూడా విడిపోతున్నట్టుగా వార్తలు వినిపించిన సంగతి అందరికీ తెలిసిందే. చాలా మంది ఈ వార్తని నిజం అనుకోని నమ్మారు కూడా. కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు, రోషన్ కూడా ఇది నమ్మి వాళ్ళ అమ్మ ని అడిగాడట.

దానికి సుమ ఒక నవ్వు నవ్వి సోషల్ మీడియా లో ఇప్పుడే చూస్తున్నావా, నేను క్యాష్ ప్రోగ్రాం లో చెప్పిన రేంజ్ హెడ్ లైన్స్ వేసి యూట్యూబ్ లో పెడుతుంటారు. అవన్నీ నమ్మితే నువ్వు ప్రశాంతం గా ఉండలేవు, పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకో అని చెప్పిందట. ఈ విషయాన్నీ రోషన్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఈ విడాకులు రూమర్ ఇంట్లో తనతో అందరినీ బాగా డిస్టర్బ్ చేసిందట.
