Roshan Kanakala : యాంకరింగ్ రంగం లో సుమారుగా రెండు దశాబ్దాల నుండి క్వీన్ గా కొనసాగుతున్న సుమ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ రెండు దశాబ్దాలలో ఎంతో మంది యాంకర్లు వచ్చారు, వెళ్లారు, కానీ సుమ స్థానం ని మాత్రం ఎవ్వరూ అందుకోలేకపోయారు. ఇప్పటికీ ఇంటర్వ్యూస్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి సుమనే మేకర్స్ కి మొదటి ఛాయస్.
ఇక ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ ఉన్న నటుడు, ఈ మధ్య ఆయన ప్రతీ సినిమాలోనూ కనిపిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరి తనయుడు రోషన్ కనకాల ఇండస్ట్రీ లో హీరో గా పరిచయం అవుతూ చేసిన చిత్రం ‘బబుల్ గమ్’. ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు రోషన్ ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘నటన లో నేను మా తాతయ్య దేవదాస్ కనకాల గారి దగ్గర రెండు నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత లాస్ ఏంజిల్స్ లో ఒక కోర్స్, అలాగే పాండిచెర్రీ లో మరో కోర్స్ తీసుకున్నాను. ఇండస్ట్రీ లో అమ్మ నాన్న కి మంచి పేరు ఉండడం తో, నాపై చాలా బాధ్యత పెరిగింది. ఈ సినిమా నాకు మొదటి సినిమాలాగే అసలు అనిపించలేదు. ఎందుకంటే సెట్స్ మీదకు వెళ్లే ముందే మేము నెల రోజుల పాటు రిహార్సల్స్ చేసాము.ఏ సన్నివేశం లో ఎలాంటి ఎమోషన్స్ పండాలి వంటివి మొత్తం నేర్చుకున్నాను.
ఆ తర్వాత నటనలో నాకు ఏదైనా అనుమానం వస్తే అమ్మ నాన్నని అడిగేవాడిని. రీసెంట్ గానే అమ్మ నాన్న ఇద్దరు ఈ సినిమాని చూసారు. వాళ్ళు ఈ సినిమాని చూస్తున్నప్పుడు నేను పక్కన లేను. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు నాన్న ఏడ్చేశాడని అమ్మ చెప్పింది. అది విన్నాక నాకు చాలా సంతోషం వేసింది’ అంటూ రోషన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.