Roshan Kanakala : ట్రోలింగ్ అంటూ రెచ్చిపోయిన సుమ కొడుకు.. ఇప్పుడు ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు.. పాపం ఇలా చిక్కాడేంటి..!

- Advertisement -

Roshan Kanakala : సుమ క‌న‌కాల త‌న‌యుడు రోష‌న్ కన‌కాల బ‌బుల్‌గ‌మ్ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ డిసెంబ‌ర్ 29న ప్రేక్ష‌కుల ముందుకురాబోతోంది. బ‌బుల్‌గ‌మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. స్కిన్ క‌ల‌ర్ విష‌యంలో త‌న‌పై వ‌స్తోన్న‌ ట్రోల్స్‌పై రోష‌న్ క‌న‌కాల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రియాక్ట్ అయ్యాడు.

“మ‌స్తు క‌ర్రెగా (న‌ల్ల‌గా) ఉన్నాడు. వీడు హీరో ఏంటి” అని త‌న గురించి చాలా మాట్లాడుకోవ‌డం విన్నాన‌ని, చ‌దివాన‌ని రోష‌న్ క‌న‌కాల అన్నాడు. “వీడు హీరో మెటీరియ‌ల్, వీడి ముఖం బాగా లేద‌ని” త‌న‌పై దారుణంగా నెగెటివ్‌ కామెంట్స్ చేశార‌ని రోష‌న్ క‌న‌కాల చెప్పాడు. “నేను ఇలాగే పుట్టా..ఇలాగే ఉంటా. ఒక మ‌నిషికి న‌లుపు తెలుపు…అందం కాదు. ఒక మ‌నిషి స‌క్సెస్‌ను డిసైడ్ చేసేది ఆ మ‌నిషి హార్డ్ వ‌ర్క్‌, టాలెంట్‌, డిసిప్లెన్ మాత్ర‌మేన‌ని” రోష‌న్ క‌న‌కాల అన్నాడు. ఓ రోజు వ‌స్తాది. వ‌ద్ద‌నుకున్నా విన‌బ‌డ‌తా. చెవులు మూసుకున్నా విన‌బ‌డ‌తా. డిసెంబ‌ర్ 29న థియేట‌ర్ల‌కు రండి. బ‌బుల్‌గ‌మ్‌లో ఈ ఆదిగాడి ల‌వ్‌ను చూడండి. గౌర‌వం కోసం ఆదిగాడు చేసే పోరాటం చూడండి అని రోష‌న్ క‌న‌కాల కామెంట్స్ చేశాడు. త‌న‌పై వ‌స్తోన్న ట్రోల్స్‌పై రోష‌న్ క‌న‌కాల చేసిన కామెంట్స్‌ వైర‌ల్ అయ్యాయి.

ఈ వీడియోను కొన్ని సినిమా న్యూస్ వెబ్‌సైట్లకు చెందిన ఎక్స్ హ్యాండిల్స్ పోస్ట్ చేశాయి. అయితే, ఈ వీడియోల కింద నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు సుమ కొడుకుని ఎవరు ట్రోలింగ్ చేశారు అని ప్రశ్నిస్తున్నారు. ఇతడిని పట్టించుకునేంత ఖాళీ ఎవరికీ లేదని.. అసలు మొదటిసారి చూస్తున్నామని కొందరు నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. కావాలనే రోషన్ ఇలా ట్రోలింగ్ అనే ఆయుధాన్ని వాడుతున్నాడని విమర్శిస్తున్నారు. సినిమా ప్రమోషన్ కోసం ఇవి రోషన్ ట్రిక్స్ అని తప్పుబడుతున్నారు. దీంతో ఇప్పుడు రోషన్‌పై ట్రోలింగ్ మొదలైనట్టు కనిపిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here