Roja : టాలీవుడ్ సీనియర్ స్టార్ బ్యూటీ రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఏపీ మంత్రిగా ఉన్న ఆమె టీడీపీ, జనసేన నేతలపై విరుచుకుపడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఒకప్పుడు జబర్దస్త్ జడ్జిగా పనిచేసిన రోజా.. మంత్రి అయ్యాక పూర్తిగా రాజకీయాల్లోనే ఉండిపోయారు. రోజుకో వివాదం ఆమె అలవాటు అయిపోయింది. ఎప్పటికప్పుడు పలువురి నుంచి విమర్శలు గుప్పిస్తున్న రోజా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఏడాది బెంగళూరులో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.
బెంగుళూరులో తన కుటుంబ సభ్యులతో కలిసి న్యూ ఇయర్ జరుపుకున్న ఆమె బెంగుళూరు పబ్లో పాటలకు లయబద్ధంగా స్టెప్పులు వేస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో బ్లాక్ కలర్ డిజైన్ డ్రెస్సుల్లో రోజా మెరిసిపోయింది. పబ్లో రోజా డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో అంగన్వాడీలు, పారిశుధ్య కార్మికులు.. రోడ్డుపై బైఠాయించి నిరసనలు.. ఇలా ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే.. మంత్రిగా మీకేమీ పట్టదా అంటూ విమర్శిస్తున్నారు.
బెంగుళూరులోని ఓ పబ్ లో చిందులు వేస్తున్నావ్.. అసలు మంత్రివేనా.. నీకు అస్సలు సిగ్గు లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో నంద్యాల ఉపఎన్నికల్లో పంజాబీ డ్రెస్ వేసుకుని ప్రచారం చేసిన భూమా అఖిలప్రియపై రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో పబ్ లో చిందులు వేస్తున్నావ్.. ఆంధ్రా వాళ్ల సమస్యలు ఏవీ పట్టించుకోవడం లేదు… నువ్వు చేసేది మాత్రం తప్పు కాదంటూ తిట్టిపొస్తున్నారు. మరి దీనిపై రోజా ఎలా స్పందిస్తుందో చూడాలి.