Rocking Rakesh : జబర్దస్త్ రాకింగ్ రాకేష్, యశ్వంత్, హిందోలా చక్రవర్తి, పూజ , సిమ్రాన్ ప్రధాన
పాత్రలలో రేలంగి నరసింహ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ హర్రర్ చిత్రం ఊ అంటావా మావా.. ఉ ఊ అంటావా మామ.. తుమ్మల ప్రసన్నకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.. ఈ సినిమా రేపు ఫిబ్రవరి 18న మహా శివరాత్రి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ విడుదల కానుంది.. ఈ సందర్భంగా రాకింగ్ రాకేష్ మీడియాతో ముచ్చటించారు..

రాకింగ్ రాకేష్ మీడియాతో మాట్లాడుతూ.. సాధారణంగా కామెడీ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి.. అంతకుమించి మళ్ళీ మీ అందర్నీ నవ్వించడానికి మా గురువుగారు రేలంగి నరసింహారావు ఫుల్ ఫ్యామిలీ హర్రర్ కామెడీ డ్రామా తో మీ ముందుకు రాబోతున్నాను. ఈనెల 18న మహాశివరాత్రి సందర్భంగా థియేటర్లో విడుదల అవుతుంది. తప్పకుండా మీరందరూ థియేటర్లో చూడండి ఊ అంటావా మావా.. ఉ ఊ అంటావా మామ.. అని రాకింగ్ రాకేష్ అన్నారు.
జబర్దస్త్ స్టేజ్ మీద రాకింగ్ రాకేష్ తనదైన శైలిలో పంచులు వేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అదే జబర్దస్త్ లో తన స్కిట్లలో నటించే సుజాతను ప్రేమించారు. కొన్నాళ్ళు ప్రేమించుకున్న వీరిద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో సన్నిహితుల మధ్య ఇటీవల నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. త్వరలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కట్టి కానున్నారు. రాకింగ్ రాకేష్ జీవితంలోకి సుజాత రావడంతోనే ఈ సినిమా ఒప్పుకోవడం.. త్వరగా షూటింగ్ పూర్తి చేసుకోవడం.. అదే విధంగా ఈ సినిమా రేపు విడుదల కావడం జరుగుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా చూసిన పలువురు సినిమా డైరెక్టర్లు, హీరోలు ఈ సినిమా బాగుందని చెప్పారని .. ఈ సినిమా దర్శకుడు రేలంగి నరసింహారావు మీడియా ముందు చెప్పారు. ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అండ్ అంతా అనుకుంటున్నారు. అంతేకాకుండా రేలంగి నరసింహారావు ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో 76 సూపర్ హిట్స్ అందించారు. అలాంటి తన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దాంతో జబర్దస్త్ రాకింగ్ రాకేష్ కెరియర్ లో ఈ సినిమా మంచి హిట్ గా నిలవనుందని.. ఇదంతా రాకేష్ సుజాతల అదృష్టమే అని.. సుజాత తన జీవితంలోకి రావడంతోనే రాకింగ్ రాకేష్ తన కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోబోతున్నాడని అంతా అనుకుంటున్నారు.