Ritu Varma : చీరకట్టులో ఆకట్టుకుంటున్న రీతు వర్మ

- Advertisement -

రీతు వర్మ.. ఈ తెలుగు బ్యూటీ చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేసింది. తాజాగా చీరకట్టులో అలరించింది. మల్టీకలర్ షిమ్మర్ శారీలో ధగధగ మెరిసిపోయింది. సింపుల్ జ్యువెలరీతో క్యూట్ గా కనిపించి ఆకట్టుకుంది. తన లేటెస్ట్ ఫొటోషూట్ కు సంబంధించిన ఈ భామ పోస్టు చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Ritu Varma

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఏమైపోయావ్ రీతు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా సన్నగా అయిపోయావ్ రీతు అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. ఆమె లావెప్పుడు కనిపించింది బ్రో నీకు అంటూ ఇంకో యూజర్ రిప్లై ఇచ్చాడు. తెలుగమ్మాయిలకు టాలీవుడ్ లో నిజంగానే సరైన ఆఫర్స్ రావు బ్రో అంటూ ఇంకొక నెటిజన్ తన ఫీలింగ్ షేర్ చేసుకున్నాడు.

- Advertisement -

రీతు వర్మ టాలీవుడ్ లో డజను వరకు సినిమాలు చేసింది. తమిళ్, మలయాళంలోనూ ఈ భామ నటించింది. పెళ్లి చూపులు సినిమాతో ఈ భామ హీరోయిన్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ సినిమాలో ఈ బ్యూటీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు చేజిక్కించుంది. మొదట్లో హిట్ లు వచ్చినా.. ఆ తర్వాత సినిమాలు అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి.

ఇక ప్రస్తుతం రీతు వర్మకు అవకాశాలు ఏం లేవు. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ పెద్దగా యాక్టివ్ గా ఉండదు. తాజాగా మాత్రం ఈ భామ తన లేటెస్ట్ ఫొటోషూట్ కు సంబంధించిన ఫొటోలు పోస్టు చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. చీరకట్టులో రీతు చాలా అందంగా కనిపించింది. చాలా రోజుల తర్వాత తమ ఫేవరెట్ హీరోయిన్ ఫొటోలు పోస్టు చేయడంతో రీతు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here