Ritu Chaudhary ఈ బూతులేంటి.. నీకు కొంచెమైనా సిగ్గుందా అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు

- Advertisement -


Ritu Chaudhary : తొలుత బుల్లితెర నటిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో భారీ పాపులారిటీ దక్కించుకున్న బోల్డ్ బ్యూటీ రీతూ చౌదరి. హైపర్ ఆది టీంలో ఆమె వరుసగా పదుల సంఖ్యలో స్కిట్లు చేసి పాపుల‌ర్ అయింది. సడన్ గా జబర్దస్త్ కు దూరమైన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు పొట్టి బట్టలు, దారుణమైన స్క్రీన్ షో చేస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తుంటుంది. ఇలా బోల్డ్ ఇమేజ్ కలిగిన ఈ అమ్మడు గ్లామరస్ ఫోటోలు మీద జనాలు ఎప్పటికప్పుడు ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. సరిగ్గా బట్టలు కొనుక్కోడానికి కూడా డబ్బులు లేవా తల్లి అంటూ కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా కోకొల్లలు ఉన్నాయి. అయితే ఎవరెన్ని కామెంట్స్ చేసినా తన పని తానే చేసుకుంటూ పోయే రీతూ చౌదరి.. ఇటీవల ఓ టాక్ షో కి హోస్ట్ గా మారింది.

Ritu Chaudhary
Ritu Chaudhary

తన ఇమేజ్ ను ఏమాత్రం తగ్గించకోకుండా.. బోల్ట్ కంటెంట్ తో ఈ టాక్ షో ముందుకు నడిపిస్తోంది. ఈ షో యూట్యూబ్ లో ప్రసారం అవుతోంది. డిజిటల్ మీడియా కావడంతో అందులో ఎలాంటి పరిమితులు ఉండవు. దీంతో పరమ చెత్త బూతు కంటెంట్, బూతు ప్రశ్నలతో రెచ్చిపోతుంది రీతు. బూతులను కూడా బీప్ లేకుండా ప్రసారం చేస్తున్నారు. ఇటీవల గెస్ట్ గా వచ్చిన సోహెల్ మాట్లాడిన బూతులన్నీ ఎలాంటి కట్ లేకుండా టెలికాస్ట్ చేసేశారు. కాగా ఆ టాక్ షో పేరు దావత్. ఇక‌ ఇటీవల హీరో నవదీప్ రీతు హోస్టుగా వ్యవహరిస్తు్న్న షోకు గెస్ట్ గా వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలు చాలా బోల్డ్‌గా సాగాయి. నీకు నేను పోరంబోకు ఫ్యాన్ అని రీతు చౌదరి నవదీప్‌తో అంటుంది. అదేంటి అంటే నువ్వు హీరోగా చేసిన పోరంబోకు సినిమాను థియేటర్లో చూసిన పోరంబోకు ఫ్యాన్ ను అంటూ వివరించింది.

Navadeep

ఇప్పుడు ఆ సినిమా గురించి అవసరమా అని నవదీప్ ప్రశ్నించగా.. అతని అడగకూడని ప్రశ్న అడిగింది.. నీకు అది సింగిల్ గా ఇష్టమా.. గ్రూప్ గా ఇష్టమా.. అంటూ ప్రశ్నించింది. దేని గురించి అడుగుతున్నావ‌ని నవదీప్ ప్రశ్నించగా.. నీ మైండ్ లో ఏది రన్ అవుతుందో దాని గురించే అంటూ బోల్డ్‌ రిప్లై ఇచ్చింది రీతూ చౌదరి. నాకు సింగిల్ గానే ఇష్టం అంటూ న‌వ‌దీప్ ఆన్సర్ ఇచ్చాడు. ఇలా డబుల్ మీనింగ్, పచ్చి బూతులతో, చెత్త ప్రశ్నలు, బోల్డ్ కంటెంట్ తో ఈ షోల్ కంటిన్యూ చేస్తుందో రీతూ చౌదరి.

- Advertisement -

ఇది చూసిన వారంతా నిన్ను కాదు మీ ఇంట్లో వాళ్లను అనాలి.. ఆడపిల్లని మరిచిపోయి మరి సిగ్గు లేకుండా పచ్చి బూతు ప్రశ్నలు అడుగుతూ రెచ్చిపోతున్నావ్ అంటూ.. అలాంటి ప్రశ్నలు ఇలాంటి డిజిటల్ మీడియా ఇంటర్వ్యూలో అడగడానికి కాస్త కూడా సిగ్గు వేయడం లేదా అంటూ.. ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరికొంద‌రు మాత్రం ఈ పిల్ల మ‌రో ఆర్జీవీల మారేలా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దావత్ గేమ్ షో తో రీతు చౌదరి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here