Ritika Singh : రియల్ బాక్సర్ కమ్ హీరోయిన్ రితికా సింగ్ కు లక్కీ ఛాన్స్ దొరికింది. రియల్ బాక్సర్ అయిన ఈ నార్త్ హీరోయిన్ ఇరుదుచుట్రు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సుధాకొంగర డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మాధవన్ హీరోగా నటించారు. ఆ మూవీతో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. అదే సినిమా తెలుగు రీమేక్ గురులోనూ రితికా సింగ్ హీరోయిన్ గా నటించింది. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లు రావడంతో.. తమిళంలో అండవన్ కట్టలై, శివలింగా, ఓ మై కడవులే లాంటి సక్సెస్ ఫుల్ మూవీల్లో నటించింది.

కానీ ఈ మధ్య రితికా సింగ్ కు మూవీ ఛాన్స్ లు తగ్గాయి. దీంతో ఐటమ్ సాంగ్ చేయడానికి వెనుకాడలేదు.రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కొత్తలో ఐటెం సాంగ్ చేసింది. . మరోవైపు సోషల్ మీడియాలో హాట్ షోతో రెచ్చిపోయింది. ఇన్‌స్ట్రాగామ్‌లో తనకు సంబంధించిన ఫొటోలు, వర్కౌట్స్ చేసిన వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. అలా నాలుగు మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ఈ క్రేజ్ తో తాజాగా మరో భారీ ఛాన్స్ కొట్టేసింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొత్త సినిమాలో కీ రోల్ కోసం రితికకు ఛాన్స్ దొరికింది. జై భీమ్ మూవీ ఫేమ్ జ్ఙానవేల్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ఇప్పటికే నటి మంజువారియర్, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, హీరో రానా, నటి దుషారా విజయన్ నటిస్తున్నారు. ఇప్పుడు వీరి సరసన నటి రితికా సింగ్ చేరారు. ఈ ఛాన్స్ తోనైనా.. రితికాకు మరిన్నిఅవకాశాలు వస్తాయో లేదో చూడాలి.