Ritu Choudhary : సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించి జబర్దస్త్‌లోకి అడుగుపెట్టింది రీతూ చౌదరి. సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోత ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్యూటీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ గురించి తెలిసిందే. తాజాగా రీతూ మార్ఫింగ్ వీడియోలు విడుదలై వైరల్‌గా మారాయి. ఈ వీడియోలపై రీతూ తొలిసారిగా స్పందించింది.
ఆమె తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మాట్లాడుతూ.. తన ఫొటోలు, వీడియోలను ఎవరో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని తెలిపింది. ఆ వీడియోల్లో నన్ను ట్యాగ్ చేసి పైశాచికానందం పొందారని, సోషల్ మీడియాలో చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన జరిగి దాదాపు ఐదు నెలలు కావస్తున్నా ఈ విషయం చెప్పాలా? వద్దా ? అని తనలో తానే చాలా సార్లు బాధపడ్డానని, బయటికి చెబితే ఏమవుతుందో అని భయపడిపోయానని చెప్తూనే.. ఈ వీడియో చేసేందుకు కూడా ఆలోచించానని.. కానీ చేయక తప్పడం లేదంటూ చెప్పుకొచ్చింది.
తన ప్రియుడు శ్రీకాంత్ గురించి కూడా మాట్లాడింది. తాను, శ్రీకాంత్ బయటికి వెళ్లినప్పుడు ఈ వీడియోల గురించి చెబుతూ.. తనకు మద్దతుగా నిలిచాడని చెప్పింది. తన మార్ఫింగ్ వీడియోలు చేసిన వారిపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసినట్లు రీతూ చౌదరి తెలిపింది. పోలీసులు వారిని పట్టుకున్నారు. వారిపైనే కాకుండా నాతో వస్తావా..రేటు ఎంత అని సోషల్ మీడియాలో అడిగిన వారిపై కూడా ఫిర్యాదు చేశానని చెప్పింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.