Kukkala Mayor : టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాల అప్డేట్స్ , ఇంటర్వ్యూలు, ట్వీట్స్ ఏదైనా సరే ఆయన చేస్తే క్షణాల్లో వైరల్ అవుతాయి. సినిమాల పరంగానే కాకుండా సామాజిక అంశాల పైన కూడా ఆర్జీవి స్పందిస్తుంటారు తనదైన పాయింట్ ఆఫ్ వ్యూలో పరిశోధిస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు.. ఇటీవల హైదరాబాద్ లోని అంబర్పేట కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే..

నాలుగేళ్ల బాలుడిని వీధి కుక్కలు దాడి చేసి చంపడంతో ఆర్జీవి తట్టుకోలేక పోయారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆర్జీవి ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు వరుస ట్వీట్లతో ట్విట్టర్ ని హోరెత్తించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. ముఖ్యంగా మున్సిపాలిటీ బాధ్యత వహించాలని పోరాడారు కానీ.. ఆ నగర మేయర్ కూడా నిర్లక్ష్యంగా స్పందించడంతో .. తట్టుకోలేక పోయినా ఆర్జీవి.. మేయర్ గద్వాల విజయలక్ష్మి కి బుద్ధి చెప్పే విధంగా కుక్కల్ మేయర్ అనే స్పెషల్ సాంగ్ ఆయనే స్వయంగా లిరిక్స్ రాసి, పాడి వీడియోను విడుదల చేశారు..
అడుక్కున్న పన్నులు అన్నీ మింగిన మీరు.. మొరిగించి.. కరిపించి చంపించారు.. మీ ఇంటిలోకి వందల కుక్కలు వదిలితే.. మీ పరిస్థితి అప్పుడు కానీ నొప్పి తెలియదు.. మీ కుక్క బ్రెయిన్ కు.. పాపం ఎవరిది మేయర్.. ప్రాణం ఎవరిది మేయర్.. ఆ తల్లిదండ్రుల గుండెలు వెక్కివెక్కి ఏడుస్తుంటే కొద్దిగా అయినా బాధ ఉందా మీకు అంటూ ఆర్జీవి నా పాట రూపంలో మేయర్ గద్వాల విజయలక్ష్మిని కడిగిపారేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కుక్కల మేయర్ పాటను విన్న మరి కొంతమందిని నెటిజన్స్ కూడా ఘాటుగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఆర్ జి వి కి సపోర్ట్ చేస్తూ ఆ పిల్లాడి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరోసారి ఈ వీధి కుక్కల దాడుల బారిన ఎవరు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.