Aaradhya Devi : పద్ధతిగా చీర కట్టుకునేది.. పాపం ఇలా చేశావేంటి ఆర్జీవీ.. మొత్తం చూపించేస్తుందిగా

- Advertisement -

Aaradhya Devi : రామ్ గోపాల్ వర్మ ఈ పేరంటే తెలియని వారుండరు. వివాదాలు కేరాఫ్ గా నిలుస్తారు ఆర్జీవీ. ఆయన ఇప్పుడంటే కాంట్రవర్సీ సినిమాలు చేస్తున్నారు కానీ ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రేక్షకులకు అందించారు. టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఆర్జీవీ సినిమాలు కూడా ఉండేవి. అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ శివ. ఒకప్పుడు ఈ సినిమా సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. యాక్షన్ సినిమాలే కాదు అందమైన ప్రేమ కథ చిత్రాలు కూడా తెరకెక్కించి శబాష్ అనిపించిన్నారు.

కానీ ఇప్పుడు ఆయన అలాంటి సినిమాల జోలికిపోవడం లేదు. బయోపిక్స్, బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇటీవల కాలంలో అప్సర రాణి తో కలిసి ఒకటి రెండు సినిమాలు చేసిన ఆర్జీవీ ఆ అమ్మడి అందాలను ఓ రేంజ్ లో చూపించి ఆడియన్స్ కు పిచ్చెక్కించారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆమె పేరు ఆరాధ్య దేవి.

- Advertisement -

సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పాపులర్ అయినా ఈ చిన్న దానిని ఆర్టీవీ హీరోయిన్ ను చేశారు. అంతేనా మొన్నటివరకు చీరకట్టులో పద్ధతిగా కనిపించిన ఆమెలోని మరో యాంగిల్ ను బయటకు తీశారు. అయ్య బాబోయ్ అనేంతలా ఆమె అందాలను వర్మ తన కెమెరాలో బంధించారు. ఆరాధ్య దేవిని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో గాలించి పట్టుకున్నారు ఆర్టీవీ. ఆ తర్వాత ఆమెతో శారీ అనే సినిమాను అనౌన్స్ చేశారు. మొన్నటివరకు పోస్టర్స్ తో పిచ్చెక్కించిన ఆర్జీవీ. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు.

ఓ జలపాతం కింద ఆరాధ్య దేవీ తడుస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్ లో ఆరాధ్య దేవి తన అందాలతో ఆకట్టుకుంది. నీళ్లలో తడుస్తూ నెమలిలా నాట్యం చేస్తూ అదరగొట్టింది అమకమ. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విశేషం ఏంటంటే దాదాపు ఐదు నిముషాలు ఉన్న ఈ వీడియోలో ఎక్కడా కూడా సాంగ్ లేదు.. ఓన్లీ మ్యూజిక్ తోనే నడిపించారు. మధురమైన మ్యూజిక్ కు మతిపోగోట్టే డ్యాన్స్ చేసింది ఆరాధ్య. ఆమె డ్యాన్స్ చేస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంతలా ఆ సాంగ్ ను క్రియేట్ చేశారు వర్మ. ఏది ఏమైనా అందాలను మరింత అందంగా చూపించడంలో ఆర్జీవీ తర్వాతే మరెవరైనా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here