RGV : సూపర్ సాంగ్ లో శ్రీదేవీ, ఆర్జీవీ.. భలే ఉన్నారంటున్న నెటిజన్స్

- Advertisement -

RGV : టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ఆర్జీవీ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో క్షణక్షణం ఒకటి. 1991లో రిలీజైన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. విక్టరీ వెంకటేశ్ హీరోగా.. అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అప్పట్లో ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అలాగే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందించిన స్వరాలు ఇప్పటికీ శ్రోతల హృదయాలను అలరిస్తున్నాయి. ఈ సినిమాలోని “జామురాతిరి జాబిలమ్మ.. జోలపాడనా ఇలా..,” సాంగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సాంగ్ ఎక్కడ వినిపించిన మనసుకు చాలా ప్రశాంతత కలిగిస్తుంది.

కీరవాణి సంగీతం.. సిరివెన్నెల సాహిత్యం శ్రోతల హృదయాల్లో ఇప్పటికీ నిలిచిపోయాయి. అప్పటివరకు గొడవపడుతూ శత్రువులుగా కనిపించిన హీరోహీరోయిన్స్ ఇద్దరు అనుకోకుండా ఓ రాత్రి అడవిలో చిక్కుకుపోవడం.. అదే సమయంలో ఇద్దరి మధ్య ఫ్రెండిప్ ఏర్పడి హీరోయిన్ నిద్రపోవడానికి హీరో వెంకటేష్ పాడే జోలపాట ఇది. కానీ ఇదే పాటలో వెంకటేశ్ స్థానంలో ఆర్జీవీ శ్రీదేవి పక్కన ఉంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు అదే విషయాన్ని ఏఐ టెక్నాలజీ సాయంతో చేసి చూపించారు వర్మ ఫ్యా్న్స్. వెంకీ ప్లేసులో వర్మ కనిపించేలా ఏఐ టెక్నాలజీతో వీడియోను క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతుంది. ఇక అదే వీడియోను వర్మ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ థ్యాంక్స్ చెప్పారు. నిజానికి ఆర్జీవీ… శ్రీదేవికి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఆర్జీవి డైరెక్షన్లో ఆమె క్షణ క్షణం, గోవిందా గోవిందా చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here